గేమ్ ఛేంజర్ మూవీలో.. ‘రామ్ చరణ్’తో పాటు 18 మంది హీరోలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సూపర్ సినిమాల డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఇవాళ (జనవరి 10) థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ నెట్టింట కూడా తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్టాఫ్ కాస్త రొటీన్ గా ఉన్నా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందనే మాట వినిపిస్తోంది.

సెంటిమెంట్ బ్రేక్ అయిందా?

కియారా అడ్వాణీ (Kiara Advani) ఫీ మేల్ లీడ్ గా నటించగా, అంజలి కీలక పాత్రలో సందడి చేసింది. ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా ట్విట్టర్లో మార్మోగిపోతోంది. రామ్ చరణ్ కు హిట్ పడిందంటూ నెటిజన్లు ఈ సినిమాను బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత హిట్ కొట్టి ఎన్టీఆర్ లాగే చెర్రీ కూడా సెంటిమెంట్ బ్రేక్ చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ లో 18 హీరోలు

అయితే సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు మరో 18 మంది హీరోలున్నారు అని. అదేంటి చెర్రీ డ్యూయల్ రోల్ అంతే కదా. ఈ 17 మంది హీరోలు ఎక్కడి నుంచి వచ్చారని అనుకుంటున్నారా.. అసలు సంగతి ఏంటంటే..?

18 హీరోలు ఎవరంటే..?

ఈ సినిమాలో సునీల్, కృష్ణుడు, సత్య వంటి కమెడియన్లు, విశ్వంత్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ వంటి హీరోలు కూడా ఉన్నారు. అయితే వీరంతా గతంలో పలు సినిమాల్లో హీరోలుగా నటించిన వారన్న సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో మొత్తం 18 మంది హీరోలు నటించారన్న వార్త వైరల్ అవుతోంది. మరి ఇంకా ఎవరెవరు ఈ సినిమాలో నటించారో ఓ లుక్కేద్దామా..?

గేమ్ ఛేంజర్ లో 18 మంది హీరోలు వీళ్లే.. 

  1. రామ్ చరణ్ డ్యూయెల్ రోల్స్ లో అలరించాడు
  2. రామ్ చరణ్ తమ్ముడి పాత్రలో విశ్వంత్ (కేరింత హీరో)
  3. విలన్ పాత్రలో ఎస్ జే సూర్య (న్యూ సినిమాలో హీరో, దర్శకుడు)
  4. సూర్య అనుచరుడి పాత్రలో నవీన్ చంద్ర (అందాల రాక్షసి వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన విషయం తెలిసిందే)
  5. సీఎం పాత్రలో శ్రీకాంత్ (టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో)
  6. శ్రీకాంత్ అనుచరుడి పాత్రలో కనిపించిన సముద్రఖని (నటుడు, దర్శకుడు)
  7. రామ్ చరణ్ పెంపుడు తండ్రి పాత్రలో సీనియర్ హీరో నరేశ్
  8. సూర్య సోదరుడి పాత్రలో మలయాళ హీరో జయరాం
  9. రామ్ చరణ్ స్నేహితుడిగా బలగం సినిమా హీరో ప్రియదర్శి
  10. రామ్ చరణ్ దగ్గర బంట్రోతు పాత్రలో సునీల్
  11. క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మాన్ గా వినాయకుడు హీరో కృష్ణుడు
  12. క్రిమినల్ మైండ్ ఉన్న బిజినెస్ మాన్ గా  మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా హీరో అజయ్ ఘోష్
  13. రామ్ చరణ్ స్నేహితులుగా వైవా హర్ష (సుందరం మాస్టర్ సినిమా)
  14. చైతన్య కృష్ణ (అనగనగా ఓ అతిథి)
  15. కమెడియన్ సత్య (వివాహ భోజనంబు సినిమా)
  16. వెన్నెల కిశోర్ (చారీ 111)
  17. బ్రహ్మానందం
  18. పృథ్వీ

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *