ప్రస్తుతం టెలివిజన్ రంగంలో ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తన నటనతో గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో జన్మించిన శ్వేతా తివారీ(shweta tiwari), 16ఏళ్ల వయసులోనే టీవీ ప్రపంచంలో అడుగుపెట్టి, తక్కువ కాలంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది. చిన్న వయసులో కెరీర్ ప్రారంభించినా.. తన టాలెంట్‌తో స్టార్‌డమ్‌ను సాధించింది.
మొదట్లో చిన్నచిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 1999లో దూరదర్శన్‌లో ప్రసారమైన “కలీరీన్” సీరియల్ ద్వారా కథానాయికగా పరిచయం అయింది. అనంతరం “కసౌటి జిందగీ కే” సీరియల్‌తో టీవీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
ఒకప్పుడు నెలకు కేవలం రూ.500 జీతంతో ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం చేసిన శ్వేతా, ఇప్పుడు ఒక్క టీవీ ఎపిసోడ్‌కు రూ.3 లక్షల(3 Lakh Per Episode) వరకు పారితోషికం తీసుకుంటోంది. ‘బిగ్ బాస్ సీజన్ 4(Bigg Boss 4)’లో పాల్గొని ప్రతి వారం రూ.5 లక్షలు వసూలు చేసిన ఆమె, ఇప్పటివరకు టీవీ సీరియల్స్, యాడ్స్, రియాలిటీ షోల ద్వారా కోట్లల్లో సంపాదించింది.
ప్రస్తుతం శ్వేతకు సుమారు రూ.83 కోట్ల ఆస్తి ఉండనే టాక్ వినిపిస్తోంది. ప్రతి సంవత్సరం సుమారు రూ.10 కోట్లు సంపాదిస్తున్న ఆమె, టీవీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచింది.
View this post on Instagram
పర్సనల్ లైఫ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, కెరీర్‌లో మాత్రం శ్వేత విజయాలను సాధించింది. ఆమెకు రెండు లగ్జరీ కార్లు ఉన్నాయి.. BMW 7 సిరీస్ (ధర రూ.1.4 కోట్లు), ఆడి A4 (ధర రూ.45 లక్షలు). 44 ఏళ్ల వయసులోనూ శ్వేత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.






