Mana Enadu: న్యూజిలాండ్(New Zealand)తో సొంతగడ్డపై జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా(Team India) చివర్లో తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86 పరుగులు చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. కాసేపట్లో ఆట ముగుస్తుందనగా జైస్వాల్ (30), సిరాజ్ (0), కోహ్లీ (4) వెంటవెంటనే ఔట్ అయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ(18) ఈ మ్యాచ్‌లోనూ నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (31), రిషభ్ పంత్(1) ఉన్నారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 2, హెన్రీ ఒక వికెట్ పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్(First innings)లో భారత్ ఇంకా 149 పరుగులు వెనుకబడి ఉంది.
స్పిన్నర్లు తిప్పేశారు..
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్(Kiwis) 65.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆ జట్టులో విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు. లాథమ్ (28), ఫిలిప్స్ (17) రన్స్ చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు కూల్చాడు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్ ఇప్పటికే 0-2తో వెనుకబడి ఉంది. మూడో టెస్టులోనూ రోహిత్ సేన ఓడిపోతే వైట్‌వాష్(Whitewash) తప్పదు.
BRAIN-FADE MOMENT…!!!!#INDvNZ #INDvsNZTEST pic.twitter.com/BW9ZmlvCo8
— Moin Khan (@MoinKha71711786) November 1, 2024








