ధనత్రయోదశి రోజు ఈ 5 వస్తువులు కొనుగోలు చేస్తే చాలా శుభం!

Mana Enadu : హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ(Diwali Festival)ను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నుంచి ఈ వేడుక మొదలవుతుంది. దీపావళికి ముందు వచ్చే ఈ తిథి రోజున ధన త్రయోదశి జరుపుకుంటాం. దీన్నే ‘ధంతేరాస్ (Dhanteras)’​ అని కూడా పిలుచుకుంటాం. ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి అక్టోబర్​ 29వ తేదీ (ఈరోజు) మంగళవారం రోజున వచ్చింది.

ఈ 5 వస్తువులు కొనుగోలు చేయాలి

లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈరోజున చాలా మంది ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తారు.  ఈ పర్వదినాన బంగారం (Gold) కొనుగోలు చేస్తే చాలా మంచిదని భక్తులు విశ్వసిస్తుంటారు. అయితే పసిడితోపాటు మరికొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి అవేంటి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

బంగారం

భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారానికి విడదీయరాని అనుబంధం. అక్షయ తృతీయ రోజునే కాకుండా ధంతేరాస్ (Dhantrayodashi Gold) రోజున కూడా బంగారం కొనుగోలు చేయాలని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈరోజు గ్రాము బంగారం కొన్నా శుభ సూచికంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఇవాళ బంగారం కొనడం అంటే.. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమేనని నమ్మకం.

వెండి వస్తువులు

ధన త్రయోదశి నాడు బంగారం కొనే స్తోమత లేనివారు వెండి పాత్రలు (Silver), నాణేలు కొనుగోలు చేస్తే ఇంటికి సంపద, శ్రేయస్సు కలుగుతుందనేది చాలా మంది నమ్మకం.

వంట పాత్రలు

ధంతేరాస్ నాడు వంట పాత్రలు కొనుగోలు చేయడం కూడా శుభప్రదం. కొత్త వంట పాత్రల(Utensils)తో వంటగది కళకళలాడుతుందని.. అప్పుడు  లక్ష్మీదేవి ఇంట్లో కాలు పెడుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు.

కొత్త చీపురు 

పురాణాల ప్రకారం.. చీపురు (Broom) ఇంట్లోని ప్రతికూలతలను తొలగిస్తుందనేది నమ్మకం. సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి అనుగ్రహానికి చీపురు మార్గం చూపుతుందని అందుకే ధన త్రయోదశి రోజున కొత్త చీపురును తప్పకుండా కొనుగోలు చేయాలని పండితులు సూచిస్తుంటారు.

ప్రమిదలు

ధన త్రయోదశి నాడు మట్టితో తయారు చేసిన ప్రమిదలు కొనుగోలు చేసి ఆ దీపాలు వెలిగిస్తే.. ఆ దీపకాంతుల వెలుగు ఇంట్లోకి లక్ష్మీ దేవి(Goddess Lakshmi Devi)ని ఆహ్వానిస్తుందని నమ్మకం. ఆ వెలుగు జీవితంలోని చీకటిని ప్రతికూల శక్తులను తొలగిస్తుందనేది భక్తుల విశ్వాసం.

మరి ఈ ధంతేరాస్ రోజున ఈ ఐదు వస్తువులు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి

గమనిక : పైన తెలిపిన వివరాలు జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.  వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత విషయం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *