Mana Enadu : మిస్ యూనివర్స్ ఇండియా 2024(Miss Universe India 2024) కిరీటాన్ని గుజరాతీ భామ సొంతం చేసుకుంది. జైపుర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీల్లో 18 ఏళ్ల రియా సింఘా విజయం సాధించింది. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్కు జడ్జిగా వ్యవహరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న రియా (Rhea Singha)కు ఊర్వశీ కంగ్రాట్స్ తెలిపారు.
మరోవైపు మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం చాలా చాలా హ్యాపీగా ఉందని రియా (Miss Universe India 2024 Ria Singha) హర్షం వ్యక్తం చేసింది. ఈ రోజు టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. ఈ పోటీలో పాల్గొనడం కోసం ఎంతో కష్టపడ్డానని.. ఈ స్థాయికి చేరుకోవడం వెనక చాలా కృషి ఉందని చెప్పుకొచ్చింది. గతంలో ఈ పోటీల్లో గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకున్నానని తన సక్సెస్ మంత్రను షేర్ చేసుకుంది. గుజరాత్ (Gujarat)కు చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసులోనే ఈ అందాల పోటీల్లో గెలిచి అందరినీ ఆకర్షించింది. 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకుంది.
ఈ సందర్భంగా ఈ ఈవెంట్కు జడ్జిగా వ్యవహరించిన ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) మీడియాతో మాట్లాడారు. ‘గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహిస్తుందని ఊర్వశీ తెలిపారు. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలంతా ఎంతో కష్టపడ్డారని.. వారి అంకితభావం ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
#WATCH | Jaipur, Rajasthan: Rhea Singha crowned Miss Universe India 2024. pic.twitter.com/U76NE7yKlL
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 22, 2024






