Rashid Khan: పెళ్లిపీటలెక్కిన స్టార్ క్రికెటర్.. గ్రాండ్‌గా వెడ్డింగ్ సెలబ్రేషన్స్

Mana Enadu: అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్(Afghanistan Star Cricketer rashid Khan) ఓ ఇంటివాడ‌య్యాడు. కాబూల్‌లోని ఓ హోట‌ల్‌లో ర‌షీద్‌ఖాన్ పెళ్లి(Marriage) ఘనంగా జ‌రిగింది. ర‌షీద్ పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట‌ర్లు(Afghan Cricketers), అఫ్గాన్ క్రికెట్ బోర్డు పెద్దలు హాజ‌ర‌య్యారు. ప్రస్తుతం ఈ యంగ్ ప్లేయర్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియా(Social Media)లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. కాగా పష్తూన్ ఆచారాల ప్రకారం రషీద్ వివాహం జరిగింది. ఇదిలా ఉంటే రషీద్ మాత్రమే కాకుండా, అతని ముగ్గురు సోదరులు(Brothers) కూడా ఒకేసారి వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రషీద్ తన ఇంటర్వ్యూలో అఫ్గానిస్థాన్ జట్టు ప్రపంచ కప్(World Cup) గెలిచిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అయితే, 2024లో అఫ్గానిస్థాన్ T20WCలో సెమీఫైనల్‌కు చేరడం విశేషం.

 ఆల్ రౌండర్లలో అతడికి సాటిలేరు..

ఇప్పటివ‌ర‌కు అఫ్గనిస్థాన్ త‌ర‌ఫున 105 ODIలు ఆడిన ర‌షీద్ ఖాన్ 190 వికెట్లు తీసుకున్నాడు. ఐదు వికెట్లను ఐదు సార్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణించిన ర‌షీద్‌ఖాన్ వ‌న్డేల్లో ఐదు హాఫ్ సెంచ‌రీల‌తో 1322 రన్స్ చేశాడు. అటు టీ20 క్రికెట్‌లో ర‌షీద్ ఖాన్‌కు మెరుగైన రికార్డు ఉంది. ICC T20 ఆల్‌రౌండ‌ర్స్ ర్యాంకింగ్స్‌(All-rounders rankings)లో ర‌షీద్‌ టాప్(TOP) ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు. కెరీర్‌లో 93 టీ20 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్‌152వికెట్లతో పాటు 460 ర‌న్స్ చేశాడు.

 ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు

ఐపీఎల్‌(Indian Premier League)లో ప్రస్తుతం గుజ‌రాత్ టైటాన్స్‌(GT)కు ర‌షీద్ ఖాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఇప్పటివ‌ర‌కు IPLలో 121 మ్యాచ్‌లు ఆడిన ర‌షీద్ ఖాన్ 149 వికెట్లు తీయడంతోపాటు 575 పరుగులు చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్ కంటే ముందు SRH టీమ్‌కు కూడా రషీద్ ప్రాతినిధ్యం వహించాడు. IPL 2022 మెగావేలంలో రూ15 కోట్లకు గుజ‌రాత్ టైటాన్స్ ర‌షీద్ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక ధ‌రకు అమ్ముడుపోయిన అఫ్గాన్ క్రికెట‌ర్‌గా ర‌షీద్ ఖాన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న వివిధ T20 లీగుల్లోనూ రషీద్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *