నేడే అకౌంట్లోకి “పీఎం కిసాన్​” డబ్బులు.. స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి

Mana Enadu : ప్రపంచానికే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలబెడుతున్న అన్నదాతల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులను ప్రగతి బాటలో నడిపేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే కర్షకులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం  పీఎం-కిసాన్‌ పథకం (PM Kisan Scheme) తీసుకొచ్చింది.

ఈ పథకం 18వ విడత నిధులు ఇవాళ (అక్టోబర్ 5వ తేదీన) విడుదల కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతుల (Farmers)కు లబ్ధి చేకూరనుంది. మరి ఆ లబ్ధిదారుల్లో మీరున్నారా.. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో స్టేటస్ ఇలా ఈజీగా చెక్ చేస్కోండి.

స్టేటస్​ ఇలా ఈజీగా చెక్​ చేసుకోండి:

  • www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయండి.
  • ఓపెన్ కాగానే.. “Beneficiary List” ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్​ చేయండి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ”Get Report” ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. అందులో మీ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోండి.

మీ అకౌంటులో పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా ఇలా తెలుసుకోండి :

  • ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ ఓపెన్ చేయాలి.
  • Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ నంబర్​, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయండి.
  • రిజిస్ట్రేషన్​ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్​ చేస్తే మీ వివరాలు వచ్చేస్తాయి.
  • Get OTPపై  క్లిక్​ చేస్తే మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్​ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.
  • ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ – కేవైసీ చేయించలేదని అర్థం.

e-KYC ఇలా ఈజీగా చేసుకోండి :

పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వగానే..  హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి. ఆ తర్వాత ‘Search’​ ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. మీ వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *