Mana Enadu : దేశంలో బీజేపీ (BJP) హవా క్రమంగా తగ్గిపోతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తేనే అర్థమైపోతోంది. బీజేపీకి కంచుకోట అయిన యూపీ ఫలితాలు దేశం మొత్తాన్ని నివ్వెరపరిచాయి. ఇక ఇదే అవకాశంగా ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. బీజేపీని గద్దె దించడమే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు తమ మిత్రపక్షాలతో చేతులు కలుపుతున్నాయి.
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కు బ్రేక్
ఇక తాజాగా జరిగిన హర్యానా (Haryana Elections), జమ్మూకశ్మీర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇవే సూచిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో హర్యానాలో కాంగ్రెస్, జమ్మూకశ్మీర్ లో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ (Jammu Kashmir Exit Polls 2024) అంచనా వేస్తున్నాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌కు బ్రేక్ వేసిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి.
సీఎం రేసులో ఆ ముగ్గురు
విజయం ఖాయమైందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీలో తదుపరి సీఎం (Haryana New CM) ఎవరన్న దానిపై చర్చ షురూ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా(Kumari Selja), రణ్ దీప్ సూర్జేవాలా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడ్డా ఉన్నట్లు తెలుస్తోంది.
సీఎం అభ్యర్థి ఎంపిక నిర్ణయం అధిష్ఠానానిదే
హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ 55కి పైగా సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై మాజీ సీఎం భూపేంద్ర హుడ్డా (bhupinder singh hooda) స్పందిస్తూ.. ముఖ్యమంత్రి ఎవర్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు.
కుమారి సెల్జా (Haryana New CM Kumari Selja) సీఎం కావడంపై భూపేంద్రను ప్రశ్నించగా, సీఎం అవుతానని చెప్పుకునే హక్కు ప్రతి నాయకుడికి ఉందని.. ఇక కుమారి సెల్జా పార్టీ సీనియర్ నాయకురాలు.. అందుకే సీఎం పదవిపై ఆమెకు కూడా హక్కు ఉందని అన్నారు. అయితే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
అక్టోబర్ 8న ఫలితాలు
హర్యానాలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం (అక్టోబర్ 5న) పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8వ తేదీన ఫలితాలు (Haryana Assembly Election Results 2024) విడుదల కానున్నాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు 50 నుంచి 60 సీట్లు వస్తాయని.. బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడంతో ఇప్పుడు హస్తం పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.