ప్రభాస్ తో ఆ జానర్ లో మల్టీస్టారర్.. కంగువా ప్రమోషన్స్ లో సూర్య

Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘కంగువా’ (Kanguva) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. గత వారం రోజులుగా ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారంలో భాగంగా వైజాగ్‌లో మెగా ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో నటులు సూర్య, బాబీ దేవోల్‌(Bobby Deol), మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడారు. తెలుగు నటులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరి సూర్య తెలుగు హీరోల్లో ఎవరి గురించి ఏం చెప్పారంటే..

ప్రభాస్‌: ప్రభాస్‌ గురించి ఇప్పటికే సూర్య చాలా సార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రభాస్(Prabhas) డార్లింగ్ అని చాలా మంచి వ్యక్తి అని ప్రశంసించారు. ఇక తాజా ఈవెంట్ లో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. డార్లింగ్ తో మల్టీస్టారర్‌ చేయాలని ఉందని, ఒకవేళ అది కుదిరితే మాత్రం తప్పకుండా ఫుల్‌ యాక్షన్‌ మూవీ చేస్తానని చెప్పారు సూర్య. 
రామ్‌ చరణ్‌: ఇక రామ్ చరణ్‌(Ram Charan) నాకు బ్రదర్ లాంటి వాడు. ఆయనతో నాకు చాలా మెమొరీస్‌ ఉన్నాయి. నా సినిమాలు చూసి ఫోన్‌ చేసి ప్రశంసిస్తారని. వాళ్ల కుటుంబంతోనూ  మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుంది.
ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌(NTR) తెలుగు మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆ విషయం నన్నెంతో అట్రాక్ట్ చేస్తుంది. ఆయన నటనకూ నేను అభిమానినే. 
మహేశ్‌ బాబు: స్కూల్లో మహేశ్‌ (Mahesh Babu) నాకు జూనియర్‌. ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా బాగుంటుంది. ఎమోషన్స్‌ బాగా చూపిస్తారు.
అల్లు అర్జున్‌: నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి అల్లు అర్జున్ (Allu Arjun) వాళ్ల నాన్న అల్లు అరవింద్‌ కూడా ఓ కారణం. ‘గజిని’ సినిమాను ఆయన తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. అల్లు అర్జున్‌ చాలా కష్టపడతారు. డ్యాన్స్‌ బాగా చేస్తారు. ‘పుష్ప2 (Pushpa 2)’ కోసం అందరిలాగే నేనూ వేచి చూస్తున్నాను.

ఇక ‘కంగువా’ సినిమా విషయానికొస్తే.. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొదటి పార్ట్‌ నవంబర్‌ 14వ తేదీన విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తున్న ఈ మూవీలో సూర్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని టాక్. బాలీవుడ్ బ్యూటీ దిశాపటానీ ఇందులో సూర్యకు జోడీగా నటిస్తోంది. బీ టౌన్ స్టార్ నటుడు బాబీ దేవోల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *