ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్స్ ప్రారంభం.. ఆరోజే లాస్ట్ డేట్

Mana Enadu : ఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govt) ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి పండుగ (అక్టోబర్ 31వ తేదీ) రోజున ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముందుగానే ఉచిత గ్యాస్ సిలిండర్లు బుకింగ్ (Free Gas Cylinder Bookings) చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ మేరకు ఇవాళ్టి (అక్టోబర్ 29వ తేదీ) నుంచే ఈ ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మార్చి 31, 2025 వరకు మొదటి ఉచిత సిలిండర్‌ కోసం బుకింగ్‌ చేసుకోవచ్చు.

సిలిండర్ అందకపోతే ఇలా చేయండి

నాలుగు నెలలకోసారి ఏపీ సర్కార్ ఉచిత సిలిండర్‌ అందించనుంది. గ్యాస్ సిలిండరు ఇంటికి చేరిన 48 గంటల్లోగా వినియోగదారుడి ఖాతాలో రాయితీ నగదు (Free Gas Cylinder Subsidy) జమ అవుతుంది. ఇక సిలిండర్ బుకింగ్ చేసుకున్న 24 నుంచి 48 గంటల్లో ఇంటికి చేరుతుంది. పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే వచ్చేస్తుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు (White Ration Card), క్యాండిడేట్​ ఆధార్ కార్డు తప్పక ఉండాల్సిందే. ఎవరికైనా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందకపోతే టోల్​ఫ్రీ నెంబర్‌-1967కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు

ఏపీ వ్యాప్తంగా 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటే సుమారు 1.47 కోట్ల కుటుంబాలు ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. వీరికి సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ. 3,640 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల గ్యాస్ కనెక్షన్లను ఉజ్వల (Ujwala Scheme) కిందకు మార్చితే ఏడాదికి 585 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని. ఐదేళ్లకు సుమారు 3 వేల కోట్ల మేర ప్రయోజనం కలిగే అవకాశం ఉందని సర్కార్ భావిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *