Mana Enadu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్ (Spirit Movie)’. యానిమల్ చిత్రం తర్వాత సందీప్ నుంచి వస్తున్న ఫుల్ ఆన్ యాక్షన్ సినిమా కావడంతో ఈ మూవీపై చాలా హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా గురించి డైరెక్టర్ చాలా విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ సూపర్ కాప్ గా నటించబోతున్నట్లు చెప్పాడు.
స్పిరిట్ లేటెస్ట్ అప్డేట్ ఇదే
ఇక ఈ సినిమా గురించి పలు రూపర్స్ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సోషల్ మీడియాలో స్పిరిట్ గురించి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని ఇప్పటికే డైరెక్టర్ సందీప్ వంగా (Sandeep Reddy Vanga) చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్లోనూ ప్రభాస్ నటించనున్నాడట.
గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్
ఈ చిత్రంలో తొలుత పోలీస్‌గా ఉన్న ప్రభాస్ (Prabhas), కథలోని ట్విస్ట్‌లతో గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని సమాచారం. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రభాస్‌తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలనూ సందీప్ వంగా తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ, యానిమల్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) లు కూడా స్పిరిట్ మూవీలో కనిపించనున్నారట.
స్పిరిట్ లో ఆ స్టార్ హీరోలిద్దరు
విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ చేసిన సందీప్ రెడ్డి.. అదే మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’గా తీసి బాలీవుడ్‌లోనూ హిట్ కొట్టాడు. ఇక ఇటీవలే రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ (Animal Movie)’ తీసి సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన గత సినిమాల్లో పవర్ ఫుల్ గా చూపించిన హీరోలను స్పిరిట్ లో కేమియోగా చూపించాలని సందీప్ ప్లాన్ చేస్తున్నాడట.






