Zeesan Siddique: చంపేస్తామని సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. భారీగా డబ్బు డిమాండ్

Mana Enadu: మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీ(Baba Siddique) ఇటీవల హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. తాజాగా ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జీశాన్ సిద్ధిఖీ(Zeesan Siddique)కి బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధిఖీ హత్యకు గురైన తర్వాత తన కుమారుడుకి తప్పకుండా బెదిరింపు కాల్స్(Threatening calls) వస్తాయని ముందే భావించారు. అనుకున్నట్లుగానే జీశాన్‌కి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

 బెదిరింపు కాల్స్ రాకుండానే సిద్ధిఖీ హత్య

ముంబైలో ఉన్న ఆయనకు ఓ అన్‌నౌన్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయట. జీశాన్‌ను చంపేస్తామని, పెద్దమొత్తంలో డబ్బు(Money) డిమాండ్ చేశారని సమాచారం. తాము అడిగిన మొత్తం ఇవ్వకుంటే జీశాన్‌తోపాటు బాలీవుడ్ యాక్టర్ సల్మాన్‌ఖాన్‌(Bollywood actor Salman Khan)ను కూడా చంపేస్తామని బెదిరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తాజాగా ఒకరిని అరెస్టు చేశారట. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్‌ ఫ్రెండ్‌ బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi Gang) హత్య చేసింది. సిద్ధిఖీకి ఎలాంటి బెదిరింపులు రాలేదు. కానీ హత్య(Murder)కు గురయ్యారు.

 సల్మాన్‌తో క్లోజ్‌‌గా ఉండ‌డమే కారణం

ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలోనే అనేక సార్లు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan)ను చంపేస్తామని బెదిరించింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కూడా జరిపారు. స‌ల్మా‌న్‌తో సిద్ధిఖీ క్లోజ్‌‌గా ఉండ‌డమే ఈ హ‌త్యకు దారితీసినట్లు తెలుస్తోంది. 1998లో కృష్ణ జింకలను వెంటాడినట్టు సల్మాన్​ ఖాన్‌​పై ఆరోపణలు ఉన్నాయి. బిష్ణోయ్​ తెగ(Bishnoi tribe)కు ఈ కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి. అందుకే గోల్డీ బ్రార్​, లారెన్స్​ బిష్ణోయ్(Goldie Brar, Lawrence Bishnoi)​ వంటి క్రిమినల్స్​ సల్మాన్‌పై పగబట్టారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *