Mana Enadu : ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్ తగిలింది. ఈ యాప్ సేవల్లో (Instagram) తాజాగా అంతరాయం ఏర్పడటంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీనిపై యూజర్లు ఎక్స్ వేదికగా ఫిర్యాదుల వర్షం కురిపిస్తున్నారు. తమకెదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ డౌన్ (#Instagramdown) హ్యాష్ ట్యాగ్‌తో నెట్టింట పోస్ట్ చేస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ డౌన్ మీమ్స్
Me opening Twitter to see if Instagram is down for everyone or just me #InstagramDown pic.twitter.com/tAz3qwOEmF
— Kunal Bagul (@ikunalbagul) October 29, 2024
ఇక ఏం జరిగినా దాన్ని మీమ్స్ (Instagram Down Memes) రూపంలో వైరల్ చేయడం మీమర్లకు అలవాటై పోయింది. ఇక ఇన్ స్టా గ్రామ్ డౌన్ అవ్వగానే వాళ్లు తమ పని షురూ చేసేశారు. వెరైటీ మీమ్స్ తో తమ టాలెంట్ చూపించారు. ప్రస్తుతం ఈ మీమ్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. మీమ్స్ చూసి యూజర్లు ఇన్ స్టా డౌన్ అయినా ఫన్ మాత్రం ఆగలేదంటూ ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో కామెంట్లు పెడుతున్నారు.
DMలో ఇబ్బందులు
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇన్‌స్టా సేవల్లో సాంకేతిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. డౌన్ డిటెక్టర్ (Down Detector) వెబ్‌సైట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఇప్పటి వరకు దాదాపు 2 వేల ఫిర్యాదులు నమోదు అయ్యాయి. డైరెక్ట్ మెసేజులు (DM) పంపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఇన్‌స్టా ఇంత వరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.






