Mana Enadu : సార్వత్రిక ఎన్నికల నాటితో పోలిస్తే ఏపీ(AP Voters)లో ఓటర్లు పెరిగారు. మే 13 నాటికి 4,14,01,887 మంది ఓటర్లుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4,14,20,935కు చేరింది. మొత్తం 19,048 మంది ఓటర్లు పెరిగారు. పురుషులు 2,03,47,738.. మహిళలు 2,10,69,803 ఉన్నట్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
నవంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ
నవంబర్ 28వ తేదీ వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ఈసీ (Election Commission Of India) తెలిపింది. 2025 జనవరి 6న తుది జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 9, 10, 23, 24 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రత్యేక క్యాంపెయిన్ డేలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. 2025 నాటికి 18 సంవత్సరాలు నిండబోయే వారు కూడా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.
ఓటర్ల వివరాలు
ముసాయిదా జాబితా ప్రకారం సాధారణ ఓటర్లు : 4,13,53,792 ఉండగా.. సర్వీసు ఓటర్లు : 67,143 మంది ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లు : 4,14,20,935 ఉండగా అందులో పురుషులు: 2,03,47,738 మంది.. మహిళలు (Women Voters): 2,10,69,803 మంది.. థర్డ్ జెండర్ 3,394 మంది ఉన్నారు. 4 లక్షలకుపైగా యువత ఓటు హక్కు కలిగి ఉండగా.. 4,86,226 మంది 18-19 ఏళ్ల వయోవర్గానికి చెందిన వారున్నారు.
6,13,970 మంది ఓటర్ల పెరుగుదల
2024 జనవరిలో తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 10,82,841 మంది నూతన ఓటర్లు చేరగా.. 4,68,871 ఓట్లను తొలగించారు. ఆ జాబితాతో పోలిస్తే.. ప్రస్తుతం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో నికర పెరుగుదల 6,13,970గా ఉంది. దివ్యాంగ ఓటర్లు : 5,18,801 ఉన్నారు.