Mana Enadu: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Mass Maharaja Raviteja) ప్రేక్షకులకు దీపావళి స్పెషల్ అనౌన్స్‌మెంట్(Diwali Special Announcement) ఇచ్చాడు. ఈ అదిరిపోయే అప్డేట్‌తో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా తన తర్వాత మూవీకి సంబంధించిన పోస్టర్ రివీల్ (Poster Reveal) చేయడంతో క్షణాల్లో ఆ ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల ‘మిస్టర్ బచ్చన్(Mr. Bachchan)’ మూవీతో ప్లాప్ అందుకున్న రవితేజ తన తదుపరి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాడని తాజా పోస్టర్ ద్వారా తెలుస్తోంది. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు కలిసొచ్చిన ఫార్ములాతో రాబోతున్నాడు.
టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్
రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RT75’. ‘సామజవరగమన’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి రచయితగా పని చేసిన భాను బోగవరపు(Bhanu Bogavarapu) ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మాస్ జాతర(MASS JATHARA)’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఇడియట్’ సినిమాలోని ‘మనదే ఇదంతా(It’s all ours)’ అనే డైలాగ్‌ను ఈ మూవీకి ట్యాగ్‌లైన్‌గా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మరోసారి జోడీగా శ్రీలీల
చేతిలో గంట పట్టుకుని, బొడ్డులో తుపాకీతో కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయంగా అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్‌టైనర్ పక్కా అని అర్థమవుతోంది. ఇదే పోస్టర్‌లో రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో MAY 9న విడుదల చేయనున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల(Srileela) మరోసారి రవితేజతో జోడి కడుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్(Sitara Entertainments, Fortune Four Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Get ready for a Re-Sounding Entertainer 💥
Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇
BLASTING the screens with highly
MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV
— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024






