Jai Hanuman: జై హనుమాన్ పోస్టర్ రివీల్.. అంజన్న పాత్రలో రిషబ్ శెట్టి

Mana Enadu: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా వచ్చిన ‘హనుమాన్(Hanuman)’ మూవీ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. తేజా సజ్జ(Teja Sajja) నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగానూ సూపర్ సక్సెస్ సాధించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Director Prashant Verma) తెరకెక్కించిన ఈ మూవీపై విమర్శకులు, స్టార్ సెలబ్రెటీలు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తేజ సజ్జా యాక్టింగ్.. ప్రశాంత్ వర్మ మేకింగ్, VFX విజువల్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్(Jai Hanuman)’ మూవీ రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా సినిమా ఫస్ట్ లుక్(First Look) వచ్చేసింది.

అయితే హనుమాన్ మూవీ చివర్లో డైరెక్టర్ ఓ సస్పెన్స్‌ను క్రియేట్ చేశాడు. హనుమంతుడిని చూపించాడు కానీ ఆ పాత్ర ఎవరు పోషించారనేది మాత్రం చూపించలేదు. దీంతో హనుమంతుడి పాత్రలో ఉన్నది ఎవరని అభిమానులు(Fans) తెగ ఆత్రుతగా ఎదురుచూశారు. తాజాగా ఈ పాత్ర ఎవరు పోషిస్తున్నారనేది వెల్లడైంది. దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. జై హనుమాన్(Jai Hanuman) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బుధవారం రిలీజ్ చేశారు.

 గౌరవంగా భావిస్తున్నా: ప్రశాంత్ వర్మ

జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడిగా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Kannada star hero Rishabh Shetty) నటించనున్నారు. ‘కాంతార(Kantara)’ చిత్రంతో పాన్ ఇండియాలో రిషబ్‍ పాపులర్ అయ్యారు. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‍లో(Tollywood)కి రిషబ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమంతుడిగా ఉన్న రిషబ్ శెట్టి.. మోకాళ్లపై కూర్చొని చేతులతో శ్రీరాముడి(Sriram) విగ్రహాన్ని పట్టుకొని భక్తితో గుండెలకు హత్తుకున్నారు. జై హనుమాన్ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్(Poster) ఆకట్టుకుంటోంది. ఈ మేరకు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. “గ్రాండ్ విజన్ జై హనుమాన్‍ను తీసుకొచ్చేందుకు జాతీయ అవార్డు విన్నింగ్ యాక్టర్(National Award Winning Actor) రిషబ్ శెట్టి, ప్రతిష్ఠాత్మక మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers)తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నా. జై హనుమాన్ అనే దివ్యమైన నామస్మరణతో దీపావళి(Diwali)ని మొదలుపెడదాం. ప్రపంచమంతా ఇది ప్రతిధ్వనించాలి” అని వర్మ పోస్ట్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *