మరో తెలుగు సినిమాలో జాన్వీ కపూర్.. హీరో ఎవరంటే?

Mana Enadu : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఓవైపు హిందీ మూవీస్ మరోవైపు తెలుగు చిత్రాల్లో బిజీబిజీగా గడుపుతోంది. ‘దేవర (Devara)’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ (Ram Charan) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ.. నానితోనూ ఓ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా మరో తెలుగు హీరోతో నటించే అవకాశం ఈ భామకు దక్కినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

చైతూతో జాన్వీ?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)తో జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చైతూ చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్ (Thandel)’ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీతో చై సూపర్ హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో ఓ సింపుల్ లవ్ స్టోరీలో నటించాలని డిసైడ్ అయ్యాడట.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

బ్లాక్ బాస్టర్ కాంబో రిపీట్!

ఈ క్రమంలోనే శివ నిర్వాణ (Shiva Nirvana)తో కలిసి మరోసారి పని చేయాలనుకుంటున్నాడట. ఆ సినిమాలో జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకోనున్నట్లు సమాచారం. శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ మజిలీ వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ అయితే మరో సూపర్ హిట్ మూవీ చైతూ ఖాతాలో పడిపోతుందని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రంలో చైతూకు జోడీగా జాన్వీ నటిస్తే ఇంకా బాగుంటుందని ఫ్యాన్స్ తెగా కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *