Lucky Bhaskhar Review : ‘లక్కీ భాస్కర్’గా దుల్కర్ సల్మాన్ మెప్పించాడా?

Mana Enadu : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దీపావళి (Diwali) సందడి షురూ అయింది. పండుగ సందర్భంగా రిలీజ్ అయిన సినిమాల్లో మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్ (Lucky Baskhar)’ కూడా ఒకటి. అక్టోబర్ 30వ తేదీన ప్రీమియర్ షోలతో సందడి చేసిన ఈ చిత్రం అక్టోబర్ 31 గురువారం రోజున థియేటర్లలో రిలీజ్ అయింది. దుల్కర్ సల్మాన్- వెంకీ అట్లూరి (Venky Atluri) కాంబోలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?

రేటింగ్ 3.5/5

  • మూవీ: లక్కీ భాస్కర్‌
  • నటీనటులు: దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary), రాంకీ, మానస చౌదరి, హైపర్‌ ఆది, సూర్య శ్రీనివాస్‌ మ్యూజిక్ : జీవీ ప్రకాశ్‌ కుమార్‌
  • నిర్మాత: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
  • రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
  • విడుదల: 31-10-2024

లక్కీ భాస్కర్ స్టోరీ ఇదే :

మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన సాధారణ బ్యాంక్ ఉద్యోగి భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) చాలీచాలని జీతంతో గడుపుతుంటాడు. భార్య సుమతి (మీనాక్షి చౌదరి)తో పాటు, కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడు… అందరి బాధ్యతలూ తనవే. బ్యాంకు సహా దొరికిన చోటంతా అప్పులు చేసిన భాస్కర్.. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదనుకుమటూ ఓ రిస్క్ తీసుకుంటాడు. భాస్కర్ చేసిన ఆ రిస్క్ ఏంటి? అది అతడిని కష్టాల నుంచి గట్టెక్కించిందా లేదా ఇబ్బందులను దూరం చేసిందా? (Lucky Bhaskar Review) అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

మూవీ ఎలా ఉందంటే: 

చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై ఓ కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించిన చిత్రమిది. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్, భారతీయ మధ్య తరగతి మనస్తత్వాలు… వీటన్నిటినీ మేళవిస్తూ ఓ వ్యక్తి జీవిత ప్రయాణంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు. (Lucky Bhaskar Director)

90ల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థని కుదిపేసిన హర్షద్ మెహతా కుంభకోణం కీలకంగా సాగే ఈ కథలో బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్.. మిడిల్ క్లాస్ మనస్తత్వాలన్నింటిని మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి. స్టోరీ, క్యారెక్టర్లు, తెరపై కనిపించే సంఘటనలకు ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతారు. భాస్కర్, అతడి ఫ్యామిలీ ఎదుర్కొనే కష్టాలు, అవమానాలు అతడిపై జాలి కలిగేలా చేస్తాయి. ఏదోటి చేసి ఆ సమస్యల నుంచి గట్టెక్కితే బాగుండనే అభిప్రాయాన్ని ప్రేక్షకులకు కలిగేలా చేశాడు దర్శకుడు.

కొన్ని సీన్లు ఊహించినట్టే జరుగుతున్నట్లు అనిపించినా.. ప్రేక్షకుడు ఊహించిన మరుక్షణం కథను మలుపు తిప్పి థ్రిల్ కు గురయ్యేలా చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. డబ్బు వచ్చిన తర్వాత భాస్కర్ లో వచ్చిన మార్పు, ఫ్యామిలీ డ్రామాకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. కానీ బ్యాంకులో ఎత్తులు, పై ఎత్తులు సామాన్య ప్రేక్షకులకు అంత ఈజీగా అర్థం కావు. ఇక క్లైమాక్స్ ను నార్మల్ గానే ముగిస్తున్నారనుకునేలోగా ఇచ్చే ట్విస్ట్ హైలైట్ గా నిలుస్తుంది. 

ఎవరెలా చేశారంటే :

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా బాగా నటించాడు. మీనాక్షి చౌదరికి కూడా నటనకు ఆస్కారం దక్కింది. ఇతర నటులు తమ పరిధి మేరకు నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ బీజీఎం ఈ సినిమాకు బలం. వెంకీ అట్లూరి రైటింగ్, స్క్రీన్ ప్లై బాగా కుదిరింది. ‘ఒక రోజులో అరగంట నాకు నచ్చినట్టుగా సాగలేదని, జీవితమంతా ఏడుస్తూ కూర్చోవాలా’ , ‘గెలుపు తర్వాత ఓటమి, ఓటమి తర్వాత గెలుపు’ వంటి డైలాగ్స్ మెప్పిస్తాయి. 

పాజిటివ్ పాయింట్స్ 

  •  స్టోరీ
  • దుల్కర్ సల్మాన్ యాక్టింగ్
  • ట్విస్టులు

మైనస్ పాయింట్స్ 

సెకండాఫ్ లో సాగదీత సీన్స్

కన్ క్లూజన్ : భాస్కర్… అదిరిపోయే ఆట ఆడించాడు

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *