చెర్రీ ఫ్యాన్స్ కు దీపావళి గిఫ్ట్.. గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ 

Mana Enadu  : గ్లోబల్ స్టార్ రామ్​ చరణ్ (Ram Charan) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఈ మూవీ అనంతరం ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో చిత్రం చేస్తున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ కోసం చెర్రీ ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా చరణ్ అభిమానులకు మూవీ మేకర్స్ తీపి కబురు చెప్పారు. 

నవంబర్ 8న టీజర్

నవంబర్ 9వ తేదీన ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్ తో పాటు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో లుంగీ, బనియన్ ధరించి రైల్వే ట్రాక్ మధ్యలో కూర్చుని చెర్రీ కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో చెర్రీ .. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘ముఠామేస్త్రీ’ లుక్ వైబ్ కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఇక ఈ పోస్టర్ పోస్టు చేసిన మేకర్స్ ‘హ్యాపీ దీపావళి. నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ సెలబ్రేట్ చేసుకుందాం’ అని క్యాప్షన్ ఇచ్చారు.

వచ్చే ఏడాది విడుదల

ఇక గేమ్ ఛేంజర్ సినిమా సంగతికి వస్తే ఈ మూవీలో చరణ్ కు జోడీగా బీ టౌన్ బ్యూటీ కియారా అడ్వాణీ (Kiara Advani) నటిస్తోంది. ఇప్పటికే కియారా-రామ్ చరణ్ కలిసి వినయ విధేయ రామ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్ (Director Shankar) సినిమా కోసం ఈ జంట మరోసారి జత కడుతోంది. ఇక గేమ్ ఛేంజర్ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్​ బ్యానర్​పై దిల్​రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *