Prabhas ‘Spirit’ Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ.. అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది

Mana Enadu: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pan India star Prabhas) ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు పట్టాలెక్కించేస్తున్నాడు. ఇప్పటికే ఈ సంవత్సరం వచ్చిన ‘Kalki 2898 AD’ సినిమాతో వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. కలెక్షన్ల పరంగా ఈ మూవీ రికార్డు కొల్లగొట్టింది. రూ.600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కనివిని ఎరుగని రీతిలో బాక్సాఫీస్ వద్ద రూ.1200CR కలెక్ట్ చేసింది. దీంతో బహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఈ మూవీతో మరో రేంజ్‌కి వెళ్లిపోయింది. జపాన్, కొరియా దేశాల్లో కూడా రెబల్ స్టార్‌కు ఫ్యాన్ బేస్(Fan base) పెరిగిపోయింది. ప్రస్తుతం డార్లింగ్ ‘ది రాజాసాబ్ (The Rajasab)’ మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆయన మరోసినిమా ‘స్పిరిట్(Spirit)’ ఓ లేటెస్ట్ అప్డేడ్ వచ్చేసింది.

స్పిరిట్‌పై ఫుల్ హైప్

యానిమల్ మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పిరిట్ మూవీని మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో ప్రభాస్‌ను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా చూపించబోతున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు సందీప్. అయితే దీపావళి స్పెషల్‌(Diwali Special)గా అదిరిపోయే సర్‌ప్రైజ్(Surprise) నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్‌(Musical sittings)ని దర్శకుడు సందీప్ పరిశీలిస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 తొలిసారి హారర్ సినిమాతో..

కాగా డైరెక్టర్ మారుతి(Director Maruti) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది రాజాసాబ్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రభాస్‌వి 2 పోస్టర్స్ రిలీజ్ చేశారు. హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ మొదటిసారి హారర్ సినిమా(horror movie) చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్(Malvika Mohanan, Nidhi Aggarwal, Riddhi Kumar) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చినట్లు టీటౌన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *