Israel Vs Iran: కాల్పుల విరణమణకు ఓకే.. కానీ అడుక్కోలేం: హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌

Mana Enadu: ఇజ్రాయెల్, ఇరాన్(Israel, Iran War) మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నయీం ఖాసీం(Hezbollah’s Chief Naeem Qasim) కీలక ప్రకటన చేశారు. సరైన ప్రతిపాదన జరిగితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని(Ceasefire Agreement) పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిని పట్టించుకోకుండా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే మాత్రం వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను తీసుకొస్తే కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామని ఖాసీం స్పష్టం చేశారు.

 స్పందించని ఇజ్రాయెల్

ప్రస్తుతం రెండు దేశాల్లో భయంకర పరిస్థితులు(Terrible conditions) ఉన్నాయని, చర్చలు ఫలప్రదంగా సాగితే అది శాంతియుత పరిస్థితులు(Peaceful Conditions)గా మారొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అయితే హెజ్‌బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఎప్పుడూ అడుక్కోదని స్పష్టం చేశారు. కాగా నయీం ఖాసీం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే తాము కాల్పుల ఒప్పందం గురించి ఆలోచిస్తామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఖాసీం చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు.

 అమెరికా మధ్యవర్తిత్వం

ఇటీవల ఇజ్రాయెల్ దాడిలో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా(Hezbollah chief Hassan Nasrallah was killed) హతమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హెజ్‌బొల్లా వ్యవస్థాపకుల్లో ఒకరైన నయిం ఖాసీం ఈ గ్రూప్‌కు కొత్త చీఫ్‌గా ఎంపికయ్యారు. దీంతో ఇటీవలే ఇజ్రాయెల్ మరో హెచ్చరిక చేసింది. కొత్త చీఫ్‌ కూడా ఎక్కువ కాలం ఉండడని ప్రకటించింది. ఇక ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య 60 రోజుల కాల్పుల విరమణ కోసం అమెరికా(America) మధ్యవర్తులు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *