Pawan Kalyan: ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. YCP నేతలకు పవన్ వార్నింగ్

ManaEnadu: ఆడబిడ్డలపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌తీస్తామ‌ని YCP, ఆ పార్టీ సోషల్ మీడియా మద్దతుదారుల(YCP Social Media Supporters)కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) వార్నింగ్ ఇచ్చారు. విమర్శించే ప్రతిఒక్కరికీ ఒకే మాట చెబుతున్నాని, ఇష్టానుసారంగా వ్యహరిస్తాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుటుంబ సభ్యులను తిడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెత్తటి ప్రభుత్వం కాదని అన్నారు. తాను ఇప్పటి వరకు ఏమీ అనలేదని కానీ జోలికి వస్తే ఊరుకోనని అన్నారు. పవన్ నేడు జగన్నాథ‌పురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

 సంక్షేమానికి పెద్దపీట

గొడ‌వలే కావాలంటే కావాల్సినంత గొడ‌వ‌ల‌కు సిద్ధ‌మ‌ని చెప్పారు. కానీ త‌న గొడ‌వ అభివృద్ధికి దోహ‌దప‌డే గొడ‌వ అని చెప్పారు. స‌న్నాసుల‌ను చిత్త‌కొట్టి అభివృద్ధికి బాట‌లు వేసే గొడ‌వ అని అన్నారు. నాలుగు నెలలు చూశామని తనకు సహనం పోయిందని అన్నారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమానికి పెద్దపీట(Welfare is important) వేస్తామ‌ని అన్నారు. అదే విధంగా ఆడ‌పిల్ల‌ల మాన ప్రాణాల‌కు(For the lives of girls) ర‌క్ష‌ణ క‌ల్పిస్తామ‌ని అన్నారు. వాళ్ల జోలికి వ‌స్తే ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే పోలీసు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని అన్నారు.


 త్వరలో డిజిట‌ల్ ప్రైవ‌సీ యాక్ట్

సోష‌ల్ మీడియా(Social Media)లో ఆక‌తాయిల కోసం డిజిట‌ల్ ప్రైవ‌సీ యాక్ట్(Digital Privacy Act) వ‌స్తోంద‌ని తెలిపారు. ఆ యాక్ట్ వ‌స్తే ఎవ‌రు త‌ప్పు చేసినా క్రిమిన‌ల్ రికార్డు ఉంటుంద‌న్నారు. సోష‌ల్ మీడియాలో ఆడ‌వాళ్ల‌ను దూషిస్తే క్రిమిన‌ల్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని, అవ‌న్నీ రికార్డు అవుతాయ‌ని ముందే హెచ్చ‌రిస్తున్నామ‌ని తెలిపారు. మాన‌వ హ‌క్కుల‌ను నిల‌బెట్ట‌డం కోస‌మే తాము గ‌త ప్ర‌భుత్వంపై పోరాటం చేశామ‌న్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *