దీపికా పదుకొణె-రణ్‌వీర్‌సింగ్‌ కుమార్తె పేరు ఇదే

ManaEnadu : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)- రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పటి వరకు తమ కుమార్తెను బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు. అలాగే ఆమె పేరునూ ప్రకటించలేదు. తాజాగా ఈ జంట తమ ముద్దుల తనయ పేరును సోషల్ మీడియా వేదికాగ అనౌన్స్ చేసింది. 

దువా పదుకొణె సింగ్

ఈ పసిపాపకు దువా పదుకొణె సింగ్‌ (Dua Padukone Sing) అని నామకరణం చేసినట్టు దీప్ వీర్ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘దువా అంటే ప్రార్థన అని అర్థం. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈ పసిపాప’’ అని పేర్కొంటూ చిన్నారి కాళ్లను ఫొటో తీసి ఈ జంట నెట్టింట షేర్ చేసింది. ఈ పోస్టుకు సినీ ప్రముఖులు ఆలియా భట్‌, మమితా బైజు, షాలినీ పాండేతో పాటు నెటిజన్లు కూడా స్పందించారు. సో క్యూట్ అంటూ హార్ట్ ఎమోజీలు షేర్ చేశారు.

దీప్-వీర్ సినిమా అప్డేట్స్ ఇవే

ఇక రణ్‌వీర్‌- దీపికా 2018లో వివాహ బంధం(Deepika Ranveer Marriage)లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే దీపావళి పండుగను పురస్కరించుకుని చిన్నారి పేరును అనౌన్స్ చేశారు. ఇక దీపికా.. సింగమ్ అగైన్ (Singham Again) తో ఈ శుక్రవారం రోజునే ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ క్యామియో చేశారు. ఇక రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం ‘ధురంధర్‌’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *