Devara OTT Release: ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘దేవర’

ManaEnadu: నందమూరి స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), కొరటాల శివ(Koratala Shive) కాంబోలో వచ్చిన మూవీ దేవర:పార్ట్ 1(Devara). ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా SEP 27న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) నటించారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్​గా కనిపించారు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఈ మూవీపై అదే హైప్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్​వైడ్​గా రూ.550 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.

 స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Global star NTR) నటించిన ఈ మూవీని ప్రముఖ OTT ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్(Netflix) సంస్థ దేవర సినిమా డిజిటల్ రైట్స్​ భారీ ధరకు దక్కించుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీ 2024 November 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్(OTT streaming) కానుంది. మరి పాన్ఇండియా రేంజ్​లో రిలీజైన తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్​కు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్​ దీన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే దీపావళి(Diwali) కంటే ముందే ఈ సినిమాను OTTలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేసినా అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు.

 రూ.400 కోట్ల బడ్జెట్‌తో

కాగా టీజర్, ట్రైలర్, పాటలతో భారీ హైప్‌ను సొంతం చేసుకున్న దేవర థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *