తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు.. ఎందుకంటే?

ManaEnadu : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి (నవంబరు 6వ తేదీ) నుంచి ఇంటింటి సర్వే (Family Survey in Telangana) ప్రారంభం కానుంది. కుటుంబాల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నేతృత్వంలో జరిగే ఈ సర్వే కోసం 85వేల మంది ఎన్యుమరేటర్లు సిద్ధమయ్యారు. వీరిలో దాదాపు 50వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈనెల 8వరకు ముందుగా కుటుంబాలను గుర్తించి… ఇంటింటికి స్టిక్కర్లు వేస్తారు.

నేటి నుంచి ఒంటిపూట బడి
అయితే కులగణన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి(బుధవారం) నుంచి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు ఒంటిపూట (Half Day Schools) మాత్రమే పని చేయనున్నాయి. కుల గణనలో ఉపాధ్యాయులు కూడా పాల్గొంటుండటంతో ప్రైమరీ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ప్రాథమిక పాఠశాలలు నిర్వహించనున్నారు.

50వేల మంది ఉపాధ్యాయులు
ఇక కులగణన(Caste Survey)కు దాదాపు 50వేల మంది ఉపాధ్యాయులను వినియోగించనున్నట్లు సమాచారం. వీరిలో 36 వేల 559 మంది ఎస్జీటీ, 3 వేల 414 మంది ప్రైమరీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, 6 వేల 256 మంది ఎంఆర్​సీలు, 2 వేల మంది ప్రభుత్వ మినిస్టీరల్ స్టాఫ్ సహా వివిధ విభాగాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. అయితే బోధనా పరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న SGTలకు కులగణన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

75 ప్రశ్నలతో సర్వే
ఇక.. 75 ప్రశ్నలతో కుల గణన (Telangana Caste Survey) చేయనున్నారు. వీటిలో 56 ప్రధాన ప్రశ్నలుండగా మరో 19 అనుబంధ ప్రశ్నలుంటాయి. మొత్తం రెండు పార్టులుగా ఎనిమిది పేజీల్లో సమాచారం పూరించనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు, ఇంట్లో ఎంత మంది ఉన్నారు? ఎవరైనా విదేశాలకు వెళ్లారా? వెళ్తే ఎందుకు వెళ్లారు? మీ కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారా? వంటి ప్రశ్నలడిగి వివరాలు సేకరించనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *