ManaEnadu: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో టీమ్ఇండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant) దూసుకొచ్చాడు. ఇవాళ ప్రకటించిన ఈ లిస్ట్‌లో పంత్ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి చేరుకున్నాడు. ప్రస్తుతం పంత్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మరో భారత్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్(Yashaswi Jaiswal) ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. వీరిద్దరు మినహా టాప్-10లో టీమ్ ఇండియా(Team India) ప్లేయర్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. శుభ్‌మన్ గిల్(Shubman Gill) నాలుగు స్థానాలు మెరుగపర్చుకుని 16వ ర్యాంక్‌లో నిలిచాడు.
టాప్‌లో జో రూట్
ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్(Joe Root), న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamson) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్ ఓ స్థానాన్ని కోల్పోవడంతో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్(Harry Brook) మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కివీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి(Virat kohli) 8 స్థానాలు పడిపోయి 22వ ర్యాంక్‌లో, రోహిత్ శర్మ(Rohit sharma) రెండు ర్యాంక్‌లు చేజార్చుకుని 26వ స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో వారిదే హవా
ఇక మూడో టెస్టులో 10 వికెట్లతో సత్తాచాటిన జడేజా(Jadeja) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. అశ్విన్(Ashwin) ఓ ర్యాంక్‌ను కోల్పోయి అయిదో స్థానానికి పడిపోయాడు. బుమ్రా(Bumrah) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ప్రొటీస్ పేసర్ రబాడ, ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ టాప్-2లో ఉన్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో జడేజా, అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోవడంతో WTC పాయింట్ల పట్టికలో రోహిత్ సేన 2వ ప్లేస్‌కు పడిపోయింది.
Rishabh Pant and Daryl Mitchell move into the top 10 after the recent #INDvNZ series 🙌 pic.twitter.com/D1wyVSMegM
— ESPNcricinfo (@ESPNcricinfo) November 6, 2024








