APPSC Departmental Tests 2024: ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టుల(Departmental Tests)కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 18 నుంచి 23 వరకు పరీక్షలు(Exams) జరుగుతాయని తెలిపింది. దీనికి సంబంధించి ఏ రోజు ఏ టెస్ట్ జరుగుతుంది అనే వివరాలు APPSC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు ఏ రోజు, ఏ సమయానికి, ఏ పరీక్ష ఉంటుందో APPSC వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ ఇదే..
వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు డిపార్ట్మెంటల్ టెస్ట్(Departmental Tests) నిర్వహిస్తున్నామని APPSC తెలిపింది. ఈ మేరకు సెరీ కల్చర్, మైన్స్, డివిజినల్, వర్స్క్ అకౌంట్స్ సర్వీస్, వర్క్ షాప్ ఆఫీసర్స్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్లలో ఆయా పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేది 03.12.2024.
ఈ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, అనంతపుర్, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోసం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.