ManaEnadu: అఫ్గానిస్థాన్(Afghanistan) స్టార్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ(Mohammad Nabi) కీలక ప్రకటన చేశాడు. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్(Retirement from ODI cricket) ప్రకటించాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోపీ(Champions Trophy) తరువాత వన్డే క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నబీ రిటైర్మెంట్ను అఫ్గానిస్థాన్ క్రికెట బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్(Afghanistan Cricket Board Chief Executive Naseeb Khan) క్రిక్‌బజ్(Cricbuzz)తో తెలిపారు. దీంతో అఫ్గాన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన ప్లేయర్ ఆటను ఇక ఎక్కువ రోజులు చూడలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అతడి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ACB
నసీబ్(Naseeb Khan) మాట్లాడుతూ.. ‘అవును, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నబీ ODI ఫార్మాట్‌కు రిటైర్ అవుతున్నాడు. అతను తన నిర్ణయాన్ని బోర్డు తెలియజేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) తరువాత తన వన్డే కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నట్లు అతను కొన్ని నెలల క్రితం నాకు చెప్పాడు’ అని నసీబ్ ఖాన్ పేర్కొన్నాడు. అతని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత నబీ T20 కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నానని నసీబ్ ఖాన్ పేర్కొన్నాడు.
నబీ కెరీర్ మొదలైందిలా..
కాగా మహ్మద్ నబీ 2009లో స్కాట్లాండ్(Scotland)పై తన వన్డే అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్ లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు నబీ మొత్తం 165 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 27.30 సగటుతో 3,549 పరుగులు చేశాడు. 171 వికెట్లు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం UAEలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో నబీ ఆడుతున్నాడు. మహ్మద్ నబీ 2019లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఇక 128 టీ20ల్లో అతడు 2143 రన్స్ చేశారు. ఇక IPLలోనూ నబీ కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH),ముంబై ఇండియన్స్(MI) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.








