AP Budget 2024: రూ.2.98లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. హైలైట్స్ ఇవే!

Mana Enadu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్(Finance Minister Payyav Keshav) బడ్జెట్‌(Budget)ను ప్రవేశపెట్టారు. రూ. 2.98 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడుతూ.. AP ప్రజలు కూటమి ప్రభుత్వానికి అపూర్వ విజయం ఇచ్చారని, చంద్రబాబుపై ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) నేతృత్వంలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. విభజనతో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. అనంతరం బడ్జెట్ వివరాలు వెల్లడించారు.

 వార్షిక బడ్జెట్ వివరాలు ఇవే..

☛ AP 2024-25 వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు.
☛ రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34లక్షల కోట్లు.
☛ మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లు.
☛ రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు.
☛ ద్రవ్య లోటు రూ. 68,743 కోట్లు.
☛ GDPలో రెవెన్యూ లోటు అంచనా 4.19శాతం.
☛ GDPలో ద్రవ్యలోటు అంచనా 2.12 శాతం.
☛ వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402.33 కోట్లు.
☛ వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 11,885 కోట్లు.
☛ ఇంధన రంగానికి రూ. 8,207 కోట్లు.
☛ రోడ్లు, భవనాలు రూ. 9,554 కోట్లు
☛ యువజన, పర్యాటక, టూరిజం రూ.322 కోట్లు
☛ పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు.
☛ పర్యావరణం, అటవీశాఖకు రూ.687 కోట్లు.
☛ ఉన్నత విద్యకు రూ. 2,326 కోట్లు.
☛ పాఠశాల విద్యకు రూ. 29,090 కోట్లు
☛ మైనార్టీ సంక్షేమానికి రూ.4,376 కోట్లు.
☛ అత్యల్ప వర్గాల సంక్షేమానికి రూ. 4,376 కోట్లు.
☛ ఉచిత సిలిండర్ పంపిణీకి రూ. 895 కోట్లు.
☛ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం రూ. 4,285 కోట్లు.
☛ నైపుణ్యాభివృద్ధికి రూ. 1,215 కోట్లు.
☛ ఆరోగ్య రంగానికి రూ. 18,421 కోట్లు.
☛ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 16,739 కోట్లు.
☛ మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ.11,490 కోట్లు.
☛ గృహ నిర్మాణ రంగానికి రూ. 4,012 కోట్లు.
☛ జలవనరుల నిర్వహణకు రూ. 16,705 కోట్లు.
☛ పరిశ్రమలు, వాణిజ్య రంగం రూ.3,127 కోట్లు.
☛ SC సంక్షేమానికి రూ. 18,497 కోట్లు.
☛ ST సంక్షేమానికి రూ. 7,557 కోట్లు.
☛ BC సంక్షేమానికి రూ. 39,007 కోట్లు.

కాగా ఈ నెల 22వరకు అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) నిర్వహించాలని BAC నిర్ణయించింది. బిల్లులకు, చర్చలకు అనుగుణంగా శనివారం కూడా సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులు రెండు పూటలా సభ జరగనుంది. మరోవైపు, ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవని సీఎం చంద్రబాబు(CM Chandrababu) తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చ జరిపేందుకు MLAలు విధిగా అసెంబ్లీకి రావాలని CM సూచించారు..

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *