న్యూజిలాండ్(New Zealand) స్టార్ పేసర్ టిమ్ సౌథీ (Tim Southee) తన 18 ఏళ్ల టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్( retire from Test cricket) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్లో తన హౌం గ్రౌండ్ (Seddon Park in Hamilton)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించారు. ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్(ICC Test Championship) ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నారు. దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్(Star pacer) తెలిపారు.
ఎక్కడైతే ప్రారంభిచానో.. అక్కడే ముగిస్తున్నా: సౌథీ
‘న్యూజిలాండ్(New Zealand)కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్(Blackcaps) కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి. అందుకే అక్కడే టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను’ అని సౌథీ పేర్కొన్నారు. కాగా సౌథీ రిటైర్మెంట్ ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు(New Zealand Cricket Board) కూడా ధ్రువీకరించింది.
సౌథీ కెరీర్ సాగిందిలా..
కాగా 2008లో ఇంగ్లండ్(England)పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టారు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్(Kiwis) తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన ఆయన 385 వికెట్లతో పాటు 2,185 పరుగులు సాధించారు. మరోవైపు 161 ODIల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశారు. 740 రన్స్ చేశారు. ఇక 126 T20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఐపీఎల్(Indian Premier League)లో 54 మ్యాచులు ఆడిన సౌథీ 47 వికెట్లు పడగొట్టాడు. 120 రన్స్ చేశాడు.
https://twitter.com/Nasserulislam01/status/1857286701552414851






