కార్తీక పౌర్ణమి(Karthika Pournami) రోజు భారత క్రికెటర్లు(Indian Cricketers) దంచికొట్టారు. వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి పంపంచారు. తమకు జట్టులో ఎందుకు అవకాశం ఇవ్వాలో బ్యాటుతో బాది నిరూపించారు. ఏ బాల్ ఎటువైపు బౌండరీకి వెళ్తుంది.. ఏ బాల్ ఎక్కడ వేయాలి అని బౌలర్లు తలలు పట్టుకున్నారు. ఇదంతా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా(IND vs SA) మధ్య జరిగిన నాలుగో T20లోని ముచ్చట. ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సిరీస్ నెగ్గాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచులో యంగ్ ఇండియా(Young India) సత్తా చాటింది. తొలుత బ్యాటుతో దంచి కొట్టి.. ఆ తర్వాత బాల్‌తో చెలరేగింది. వెరసీ ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా(South Africa)పై 135 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకొని T20ల్లో విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది భారత్.
వచ్చీ రాగానే దంచుడే దంచుడు
బొహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో తొలుత టాస్ నెగ్గిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(SKY) మరోమాట లేకుండా బ్యాటింగ్(Batting) ఎంచుకున్నాడు. వచ్చీ రాగానే సంజూ(Sanju), అభిషేక్(Abhishek) దంచుడు మొదలు పెట్టారు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అభిషేక్ 18 బంతుల్లో 35 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఇక అప్పుడే మొదలైంది పెను విధ్వంసం.. సంజూకి జత కట్టిన తిలక్ వర్మ(Tilak varma) ఎడాపెడా బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలతో దుమ్ముదులిపారు. సంజూ 56 బంతుల్లో 109, తిలక్ 47 బంతుల్లోనే 120 రన్స్ చేయడంతో భారత్ 283/1 భారీ స్కోరు సాధించింది. ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు సఫారీ బౌలర్లకు ఏడుపొక్కటే తక్కువ. వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలతో చెలరేగిన తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులు(Man Of The Match & Series Awards) దక్కాయి.
బంతితోనూ చెలరేగారు
అనంతరం 284 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా(South Africa)ను భారత బౌలర్లు ఓ ఆట ఆడుకున్నారు. 10 పరుగులకే 4 వికెట్లు పడగొట్టి మూడు ఓవర్లలోపే భారత విజయాన్ని ఖరారు చేసేశారు. దీంతో 18.2 ఓవర్లలో ప్రొటీస్ జట్టు 148 రన్స్ కే కుప్పకూలి 135 పరుగుల భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టులో స్టబ్స్ 43, మిల్లర్ 36, జాన్సెన్ 29 మాత్రమే రాణించారు. మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో
అర్ష్ దీప్(Arshdeep) మూడు, వరుణ్ 2, అక్షర్ 2,హార్దిక్, రమణ్ దీప్, బిష్ణోయ్ తలో ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో T20ల్లో భారత్ ఈ ఏడాదిని ఘనంగా ముగించినట్లైంది. కాగా ఈనెల 22 నుంచి భారత్ ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడనుంది.
#TeamIndia seal series victory in style yet again! 🏆🇮🇳#SAvIND #JioCinema #Sports18 #ColorsCineplex #JioCinemaSports pic.twitter.com/rvablJshgs
— JioCinema (@JioCinema) November 15, 2024






