జోహన్నెస్‌బర్గ్(Johannesburg)లోని వాండరర్స్(The Wanderers Stadium)లో సౌతాఫ్రికా(SA)తో జరిగిన నాలుగో T20లో తిలక్ వర్మ(Tilak Varma), సంజూ శాంసన్(Sanju Samson) రికార్డుల మోత మోగించారు. ప్రొటీస్ బౌలర్లను చితకబాదుతూ సెంచరీలు చేయడమే కాదు.. ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక సిక్స్(Most Sixs)ల రికార్డును కూడా నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్(HYD)లో భారత్ జట్టు బంగ్లాదేశ్(BAN)పై 22 సిక్స్‌లు బాదగా.. ఈ మ్యాచ్‌లో ఏకంగా 23సిక్స్‌లు బాది ఆ రికార్డును తిరగరాశారు. ఇందులో తిలక్ 10, సంజూ 9, అభిషేక్ 4 సిక్స్‌లు కొట్టారు. సంజూ-తిలక్ కేవలం 93 బంతుల్లోనే రెండో వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించడం విశేషం.
తిలక్ రెండు.. సంజూ మూడో సెంచరీ
T20 క్రికెట్ లో ఏ వికెట్‌కైనా ఇదే హయ్యెస్ట్ పార్ట్నర్షిప్. తిలక్ వర్మ కేవలం 41 బంతుల్లోనే టీ20ల్లో రెండో సెంచరీ చేశాడు. సౌతాఫ్రికా(South Africa)పై అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డును తిలక్ తన పేరిట రాసుకున్నాడు. మూడో T20లోనూ తిలక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇలా వరుసగా రెండు T20ల్లో సెంచరీ(Centuries)లు చేసిన రెండో ఇండియన్ బ్యాటర్ తిలక్ వర్మ. సౌతాఫ్రికా(SA)తో తొలి టీ20లో సెంచరీ ద్వారా సంజూ శాంసన్ ఆ రికార్డు సాధించిన తొలి ఇండియన్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ సంజూ కూడా 51 బంతుల్లోనే టీ20ల్లో తన మూడో సెంచరీ చేశాడు. ఇండియా(Team India) తరఫున టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన మూడో బ్యాటర్ అతడు. రోహిత్ శర్మ(Rohit Sharma) 5 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ (SKY) 4 సెంచరీలతో 2వ స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు
మొత్తంగా ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 47 బాల్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 పరుగులు చేయగా…సంజూ శాంసన్ 56 బాల్స్‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 పరుగులు చేశారు. వీరిద్దరు నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరు కలిసి 23 సిక్సర్లు కొట్టారు. T20 Cricketలో ఓ మ్యాచ్‌లో టీమిండియా కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే కావడం గమనార్హం. కాగా నాలుగో T20లో సౌతాఫ్రికా(South Africa)పై ఘన విజయం సాధించిన టీమిండియా 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 283 పరుగులు చేయగా…సౌతాఫ్రికా 148 పరుగులకే ఆలౌటైంది. వరుస సెంచరీలతో చెలరేగిన తిలక్‌కు “మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్”, “మ్యాన్ ఆఫ్ ది సిరీస్” అవార్డులు దక్కాయి.
Tilak Varma Smashed 2nd T20Is Century
-made 120 off 47
-Smashed 9 Sixes & 6 Fours#INDvSA pic.twitter.com/T10e1ueacd— Rohit Baliyan (@rohit_balyan) November 16, 2024






