టీమ్ఇండియా(Team India) అభిమానులకు గుడ్ న్యూస్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)కి కెప్టెన్ రోహిత్ శర్మ(
Captain Rohit Sharma) అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అతడితోపాటు స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) సైతం ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు సమాచారం. కాగా నవంబర్ 22 నుంచి పెర్త్(Perth) వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత ప్లేయర్లందరూ ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ తన భార్య రితికా డెలివరీ సందర్భంగా వెళ్లలేకపోయాడు. తాజాగా రోహిత్ దంపతులకు కొడుకు పుట్టిన నేపథ్యంలో రోహిత్ ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)కు మార్గం సుగుమం అయింది.
తొలి మ్యాచ్(First Match)లో రోహిత్ శర్మ భాగమవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే రెండో మ్యాచ్‌లో ఆడడం దాదాపు ఖాయం. మీడియా నివేదికల ప్రకారం, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) కూడా రోహిత్ శర్మతో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరుతారు. ఏడాది తర్వాత షమీ ఇటీవలే మైదానంలోకి వచ్చాడు. రంజీ ట్రోఫీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత షమీ కూడా చాలా మంచి ఫామ్‌లో కనిపించాడు. అయితే అతను జట్టులో చేరడంపై ఫస్ట్ మ్యాచ్ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుంది. అంటే సిరీస్‌లో రెండో మ్యాచ్(Second Test)కి ముందే అతడిని జట్టులోకి తీసుకోవచ్చు.
2023 వన్డే ప్రపంచకప్(ODI World Cup)లో మహ్మద్ షమీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్(International match) ఆడాడు. అప్పటి నుంచి గాయం(Injury) కారణంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అతను చీలమండ శస్త్రచికిత్స(Ankle surgery) చేయించుకున్నాడు. ఇటీవల, బెంగాల్ జట్టుకు ఆడుతున్న అతను రంజీ ట్రోఫీ(Ranji Trophy)లో మధ్యప్రదేశ్(MP)తో ఆడాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్‌లోనూ షమీ 18 ఓవర్లలో 74 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. NCA ఫిజియో నితిన్ పటేల్ సలహా తర్వాతే షమీపై BCCI తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.
🚨UPDATE ON ROHIT AND M SHAMI 🚨
"According to Dainik Bhaskar, Captain Rohit Sharma will leave for Australia before the first Test match and Mohammed Shami will also travel alongside Rohit Sharma."
Hope for the best🤞🏻⏳ pic.twitter.com/857f1Uzpq1
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 16, 2024






