కాగ్(Comptroller and Auditor General of India) కొత్త చీఫ్‌గా IAS అధికారి కే. సంజయ్ మూర్తి(K.Sanjay Murthy)ని అపాయింట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను కాగ్ చీఫ్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) నియమించారు. 1989 IAS బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సంజయ్‌మూర్తి నియామకాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ఆర్థికశాఖ(Central Finance Department) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కాగ్ చీఫ్‌గా కొనసాగుతున్న గిరిశ్ చంద్ర ముర్ము(
Girish Chandra Murmu) పదవీ కాలం నవంబర్ 20తో ముగియనుండటంతో ఆయన స్థానంలో సంజయ్ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.
తొలి తెలుగు వ్యక్తి మూర్తి కావడం విశేషం
ప్రస్తుత చీఫ్ గిరీశ్ చంద్ర ముర్ము(
Girish Chandra Murmu) పదవీకాలం బుధవారం (నవంబర్ 20)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్‌ను ఎంపిక చేశారు. ఈ పదవి చేపడుతోన్న తొలి తెలుగు వ్యక్తి మూర్తి కావడం విశేషం. అమలాపురం(Amalapuram) మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి(KS Murthy) కుమారుడైన సంజయ్ మూర్తి.. 1964 DEC 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989 CIVILSలో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ఆయన 2002-07 మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, IT మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. ఆ సమయంలో HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ (National Institute for Smart Government)లో మూడేళ్లు డైరెక్టర్‌గా కొనసాగారు.
ఈనెల 21న కాగ్ బాధ్యతలు
ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రటరీగా ఉన్నారు. అక్టోబరు 1, 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేలా విద్యా సంస్థలకు సహకరించడం వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. కాగా నవంబరు 21న సంజయ్ మూర్తి కాగ్ బాధ్యతలు చేపడతారు.
👉 श्री के संजय मूर्ति बने भारत के नए नियंत्रक एवं महालेखा परिक्षक (CAG)
👉 इन्हें महामहिम राष्ट्रपति द्वारा भारत के संविधान के अनुच्छेद 148(1) का प्रयोग कर भारत का नया नियंत्रक एवं महालेखा परीक्षक नियुक्त किया गया।
👉 ये गिरीश चंद्र मुर्मू का स्थान लेंगे।
👉 श्री संजय मूर्ति… pic.twitter.com/9L7xgxA8ER
— BPSC Network (@BPSC_Network) November 18, 2024






