మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra assembly elections)లో మహాయుతి కూటమి(Mahayuti alliance) భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ CM అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు సీఎం ఎంపికపై కూటమిలో నేతల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి 235 స్థానాలు గెలుచుకోగా, BJP 131 స్థానాలు, శివసేన (షిండే వర్గం) 57, NCP (పవార్ వర్గం) 41 సీట్లు నెగ్గాయి. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మంగళవారం రాజీనామా చేసి ఆ లేఖను గవర్నర్‌కు సమర్పించారు.
అధిష్ఠానంలో ఫడ్నవీస్ చర్చలు
ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం, BJP సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటివరకూ ఎలాంటి అధికారికి ప్రకటన వెలువడలేదు. అయితే షిండేని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. CM ఎంపికపై సభ్యులందరితోనూ చర్చిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)కు మద్దతు తెలుపుతున్నట్లు పలువురు శివసేన(Shiva sena) నేతలు ప్రకటించారు. సీఎం ప్రకటనపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో BJP పెద్దలతో సమావేశమయ్యేందుకు ఫడ్నవీస్ ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం.
రాష్ట్రపతి పాలన విధిస్తారా?
అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌ను ఎంపిక చేయడంపై షిండే అసంతృప్తి వ్యక్తం చేశారని కేంద్రమంత్రి రాందాస్ అధవాలే(Union Minister Ramdas Adhawale) పేర్కొన్నారు. BJPకి 132 సీట్లు వచ్చినందున ఫడ్నవీస్‌ను CMగా ప్రకటించాలని తాను భావిస్తున్నానని, ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని అన్నారు. ఒకవేళ Dy CM పదవిలో ఉండకపోతే మోదీ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. మరోవైపు అసెంబ్లీ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో ఆర్టికల్ 356 ప్రకారం ప్రెసిడెంట్ రూల్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపే అవకాశం ఉంది.