తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల(Telangana Group-1 Mains Results)ను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ(Telangana Public Service Commission) కసరత్తు చేస్తోంది. UPSC తరహాలో ఉద్యోగ ప్రకటన రిలీజైన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే 563 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా(List of Selected Candidates)ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్నిTGPSC పెట్టింది. మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసేందుకు మూడు నెలల(3 Months) సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది.
ఒక్కో పేపర్ మూడు సార్లు మూల్యాంకనం
ఈ మేరకు ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం(Double evaluation) చేస్తారు. ఒక అభ్యర్థికి మొదటిసారి వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు వ్యత్యాసం లేకుంటే ముందుకు వెళ్తారు. తేడా వస్తే మూడోసారి మూల్యాంకనం(Third time evaluation) చేసి ఫైనల్ మార్కులు(Final Marks) ప్రకటిస్తారు. ఆ మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్(Merit) జాబితాను TGPSC కమిషన్ ఫైనల్ చేస్తుంది.
మెయిన్స్‌కు 21,093 మంది హాజరు
ఇదిలా ఉండగా 563 పోస్టులకు TGPSC 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మొత్తం ఉద్యోగాలకు 4,03,645 మంది అప్లై చేసుకున్నారు. జూన్ 9న ప్రిలిమినరీ(9th June 2024 Prelims) పరీక్ష నిర్వహించగా క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో 31,382 మందిని ఎంపిక చేశారు. అయితే మొత్తం 31,403 మంది ప్రధాన పరీక్షలకు హాజరవగా 21,093 మంది గత అక్టోబర్ 21వ తేదీ నుంచి 27 వరకు మెయిన్స్(Mains) పరీక్షలు రాశారు.