ఓటీటీలోకి ‘మట్కా’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ (Varun tej)కు గత కొంతకాలంగా సరైన హిట్ సినిమా పడటం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నా గట్టి హిట్ దక్కడం లేదు. వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్‌ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘మట్కా’ (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్‌ 14వ తేదీన వివిధ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది.

అయితే థియేటర్లలో విడుదలైన 20 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీ (Matka OTT Release) లో స్ట్రీమింగ్ కు రెడీ అయింది. డిసెంబర్‌ 5వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియాలో తన ఖాతాలో పోస్టు షేర్ చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని తెలిపింది. మరి వచ్చే వీకెండ్ లో మీ ఫ్యామిలీతో జాలీగా వరుణ్ తేజ్ మట్కాను ఎంజాయ్ చేయండి.

ఇక మట్కా సినిమా స్టోరీ సంగతికి వస్తే.. 

బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు (Varun Tej Matka) అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలో జైలుకేళ్తాడు. అక్కడి జైలు వార్డెన్‌ నారాయణమూర్తి (రవిశంకర్‌) తన స్వప్రయోజనాల కోసం వాసును ఓ ఫైటర్‌లా మారుస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పూర్ణ మార్కెట్‌లో కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (Ajay Gosh) దగ్గర పనికి చేరతాడు. ఈక్రమంలో చోటుచేసుకున్న ఓ గొడవలో కె.బి.రెడ్డి (జాన్‌ విజయ్‌) రౌడీ గ్యాంగ్‌ను చితక్కొట్టి.. అతడి ప్రత్యర్థి నానిబాబు (కిషోర్‌)కు దగ్గరవుతాడు.

ఆ తర్వాత నాని బాబు అండదండలతో పూర్ణ మార్కెట్‌కు లీడర్ గా మారిన వాసు ప్రయాణం ఎలా సాగింది?  మట్కా ఆటలోకి అతడు ఎలా ప్రవేశించాడు? మట్కా కింగ్‌(Matka King)గా ఎలా ఎదిగాడు? వాసును పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దింపడానికి వెనకున్న కారణమేంటి?  అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *