చేతి వృత్తిదారుల(Handcrafters)ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన(PM Vishwakarma Yojana)’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం(scheme) ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకునేవారు కేవలం 5% వడ్డీ(Interest)తో రూ.3 లక్షల వరకు రుణ సాయం పొందొచ్చు. అయితే తొలి విడతలో లక్ష రూపాయలు(One Lakh) మాత్రమే ఇస్తారు. అవి చెల్లించిన తర్వాత రూ.2 లక్షల రుణ సాయం చేస్తారు. ఈ రెండింటి వడ్డీరేటు 5 శాతంగానే ఉంటుంది.
అదనపు ప్రయోజనాలు
ఈ పథకం కోసం అప్లై చేసుకున్న తర్వాత అర్హత, చేతివృత్తుల్లో నైపుణ్యం ఉన్నవారిని గుర్తించి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్(PM Vishwakarma Certificate), ఐడీ కార్డ్‌ల(ID Cards)ను అందజేస్తారు. ఆ తర్వాత 7 రోజుల పాటు ప్రాథమిక నైపుణ్య శిక్షణ, 15 రోజలు అధునాతన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ సమయంలో రోజుకు రూ.500 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారు. శిక్షణ(Training) పూర్తయ్యాక వస్తువుల కోనుగోళ్లకు రూ.15 వేలు టూల్‌కిట్ ప్రోత్సాహకంగా అందజేస్తారు.
అప్లై చేసుకోవాడానికి అర్హతలివే
☞ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ తేదీ నాటికి లబ్ధిదారుని కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
☞ లబ్ధిదారుడు గడిచిన ఐదేళ్లలో PMEGP, PM SVANIdhi, ముద్ర వంటి ప్రభుత్వ ఆధారిత పథకాల కింద రుణాలు పొంది ఉండకూడదు.
☞ ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తి, వారి కుటుంబ సభ్యులు పథకానికి అనర్హులు.
☞ వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, కమ్మరి, ఇనుప పరికరాలు తయారు చేసేవారు, ఇంటి తాళాలు తయారీదారులు, స్వర్ణకారులు, కుమ్మరి (కుండలు తయారుచేసేవారు), విగ్రహాల తయారీదారులు (మూర్తికార్, స్టోన్ కర్వర్, స్టోన్ బ్రేకర్), చర్మకారులు (చెప్పులు తయారుచేసేవారు), తాపీ పనిచేసేవారు (రాజ్‌మిస్త్రీ), బాస్కెట్/మ్యాట్/బ్రూమ్ మేకర్/నారతాళ్లు చేసేవారు; సంప్రదాయ బొమ్మలు తయారుచేసేవారు, క్షురకులు, పూలదండలు తయారు చేసేవారు, రజకులు, దర్జీలు, చేప వలల తయారీదారులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
☞ అప్లై చేసుకునేందుకు ఈ https://pmvishwakarma.gov.in/ని సందర్శించవచ్చు.






