Pushpa2: పాన్ ఇండియా కళ్లన్నీ బన్నీ పైనే.. ఎందుకింత క్రేజ్?

Mana Enadu : డిసెంబర్ లోకి ఎంట్రీ కాగానే సినీ ప్రేక్షకుల కళ్లు మొత్తం పుష్ఫ 2 మీదనే ఉన్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న పుష్ప మూవీ రెండో పార్టు కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్ లో రష్మి హీరోయిన్ గా, ఫహద్ ఫాజిల్ విలన్ గా యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ లేదా పుష్ఫ లో అంటే పార్టీ ఉంది పుష్ఫ అంటూ పుష్ప 2 ట్రైలర్ లో చూపించి ఆసక్తి రేకేత్తించారు. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న పుష్ప 2 మూవీ రికార్డులు బద్ధలు కొట్టేందుకు రెడీగా ఉందని ఫిల్మ్ వర్గాలు అనుకుంటున్నాయి.

ఈ సారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్

తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు ఇండియాతో పాటు, అటు ఓవర్సీస్లోనూ ఇప్పటికే బుకింగ్స్ లో దూసుకుపోతోంది. కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్ ఎర్ర చందనం సిండికేట్ నాయకుడుగా మారిన క్రమం పుష్ఫ 1 లో చూపించారు. పుష్పలో యాక్టింగ్ ద్వారా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు.

పుష్ఫ 2 లో అల్లు అర్జున్ కు ఎదురైన సవాళ్లు ఏంటీ? అనేది సినిమాలోనే చూడాలని అంటున్నారు డైరెక్టర్ సుకుమార్. యూసుప్ గూడ లో సోమవారం సాయంత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కండక్ట్ చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ కంట్రోలింగ్ కు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. కాగా పుష్ఫ 2 సినిమా కోసం అల్లు అర్జున్ దాదాపు రూ. 300 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం జరగుతోంది.

అతి పెద్ద బ్లాక్ బ్లస్టర్

ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇక 2024లో అతి పెద్ద బ్లాక్ బ్లస్టర్ గా నిలపడానికి రెడీ గా ఉందని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా పుష్ప 1 మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టింది. దీంతో అల్లు అర్జున్ స్థాయి ఒక్కసారిగా మారిపోయింది.

ఇప్పుడు పుష్ప 2 మూవీతో మరోసారి తన సత్తా నిరూపించుకునేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే బెనిఫిట్ షోల టికెట్ల రేట్లు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ఒక్కో టికెట్ ధర రూ. 3వేలకు పైగానే ఉంది. దీంతో పుష్ఫ 2 అంటే మామూలు విషయం కాదని థియేటర్లలో బొమ్మ బ్లాక్ బ్లస్టర్ హిట్ కావడం ఖాయమని అనుకుంటున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *