‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ నుంచి ఫ‌స్ట్ సింగిల్.. 18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్‌

Mana Enadu : విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టేందుకు మరోసారి జత కడుతోంది. ఈసారి ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam)’ అనే టైటిల్ తో సంక్రాంతి పండుగకు ఈ కాంబో థియేటర్లలో ఫన్ పంచేందుకు వచ్చేస్తోంది. 2025 జనవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. 

18 ఏళ్ల తర్వాత రమణ గోగుల సాంగ్

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మేకర్స్ తరచూ ఓ అప్డేట్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘గోదారి గట్టు మీద రామ చిలకవే(Godari Gattu Lyrical Song)’ అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఒక‌ప్ప‌టి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, సింగర్ రమణ గోగుల (Ramana Gogula) ఈ పాటను ఆల‌పించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆయణ్నుంచి ఈ పాట రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

ఇదే బెస్ట్ సాంగ్

ప్ర‌ముఖ రచ‌యిత భాస్క‌ర‌ భ‌ట్ల (Bhaskar Bhatla) ఈ పాటను రచించారు. ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  రమణ గోగుల హ‌స్కీ వాయిస్‌ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.  తెలంగాణ ఫోక్ సింగ‌ర్ మ‌ధుప్రియ రమణ గోగులతో కలిసి ఈ పాట పాడారు.  ఈ సాంగ్‌లో వెంకీ, ఐశ్వర్య రాజేశ్ త‌మ‌దైన డ్యాన్స్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు.

అది నా ఫేవరెట్ సాంగ్ 

ఈ పాట ఈ మూవీ ఆల్బ‌మ్‌లోనే త‌న ఫేవ‌రెట్ అని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ట్వీట్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకుల చేత థియేట‌ర్ల‌లో డ్యాన్స్ చేయిస్తుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా సంగతికి వస్తే.. ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *