Mana Enadu : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు నిర్మాతలు. ఇప్పటికి అలా రిలీజ్ అయి తమిళంతో పాటు తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమాలు కోకొల్లలు. కానీ కొంతకాలంగా సూర్య ఖాతాలో సరైన హిట్టు పడటం లేదు.
నవంబర్ 14న థియేటర్లోకి కంగువా
తాజాగా సూర్య నుంచి వచ్చిన చిత్రం కంగువా (Kanguva). శివ (Siva) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నవంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతోపాటు వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా సరైన హిట్ కోసం వేచి చూస్తున్న సూర్యకు ఈ సినిమా కూడా నిరాశే కలిగించింది.
అమెజాన్ లో కంగువా
తాజాగా కంగువా సినిమా గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నెల కూడా తిరగకుండా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కంగువా సినిమా (Kanguva Amazon Prime) డిసెంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు కంగువాను ఓటీటీ(Kanguva OTT News)లో చూసేయొచ్చు.
#Suriya’s blockbuster #Kanguva is all set to stream on Amazon Prime Video from Dec 12✨#SiruthaiSiva | #DishaPatani | #BobbyDeol pic.twitter.com/Z0vvj1v1Qr
— Kollywood Now (@kollywoodnow) December 3, 2024
విదేశీ భాషల్లో కంగువా
ఇక ఈ సినిమా సంగతికి వస్తే ఇందులో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ (Disha Patani) నటించింది. బీ టౌన్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటించాడు. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక భారతీయ భాషల్లోనే కాకుండా.. ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా ఎనిమిది భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.






