Alert: ఇక ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు!

Mana Enadu: స్మార్ట్‌ఫోన్‌లు వినియోగించే ప్రతి ఒక్కరూ వాట్సాప్(Whatsapp) వాడుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఓ నిత్యావసరంగా మారింది. మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ల(New Features)తో వాట్సాప్ సంస్థ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఆ సంస్థ నుంచి వెలువడిన కీలకమైన అప్‌డేట్ యూజర్ల(Users)ను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవాలి

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సాప్(messaging app WhatsApp) ఇకపై ఆ ఫోన్ల(Phones)లో పనిచేయదు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్ పాత వెర్షన్(Older version of Android or iOS) కలిగి ఉన్న ఫోన్లలో వాట్సాప్ సేవలు పనిచేయవని ఆ సంస్థ స్వయంగా వెల్లడించింది. అందుకే ఎప్పటికప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేసుకోవాలి.

ముఖ్యంగా ఆండ్రాయిడ్ 4 లేదా అంతకంటే పాత OS, iOS 11 లేదా అంతకంటే పాత వెర్షన్ కలిగి ఉంటే వెంటనే అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐవోఎస్‌లో అయితే 18 వెర్షన్, ఆండ్రాయిడ్‌‌లో 15 వెర్షన్ నడుస్తోంది. ఆండ్రాయిడ్ 4 లేదా ఐవోఎస్ 11 తో పనిచేసే ఫోన్లలో వాట్సాప్ సేవలు ఉండవు.

ఈ ఐఫోన్లలోనూ వర్క్ చేయదు

ఆండ్రాయిడ్ 5, iOS 12 లేదా ఆ తరువాత వెర్షన్లు ఉన్న డివైస్‌లలోనే వాట్సాప్ సేవలు కొనసాగనున్నాయి. అయితే దీనికోసం వచ్చే ఏడాది May వరకూ గడువుంది. మే తరువాత వాట్సాప్ సేవలు(Whatsapp Services) పనిచేయవు. మరీ ముఖ్యంగా మే 5 నుంచి iOS 15.1 లేదా ఆ తరువాత వెర్షన్ ఉన్న ఫోన్లలోనే వాట్సాప్ పనిచేస్తుంది.

అంటే ఐఫోన్ 5ఎస్, IPhone 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు. ఐఫోన్ యూజర్లు వాట్సాప్ సేవలు పొందేందుకు ఐవోఎస్ 15.1 లేదా ఆ తరువాత వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలి. సెట్టింగ్స్-జనరల్-సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్ల ద్వారా మీ ఐఫోన్ ఏ వెర్షన్ అనేది చెక్ చేయవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *