నాని సమర్పణలో మెగాస్టార్ మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Mana Enadu : సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న ఆయన తాజాగా తన ఫ్యాన్స్​కు ఓ సర్​ప్రైజ్ ఇచ్చారు. ఓ యంగ్ డైరెక్టర్ కథకు ఆయన రీసెంట్​గా ఓకే చెప్పినట్లు ఇటీవల సోషల్ మీడియాలో న్యూస్ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ ఓ అధికారిక అనౌన్స్​మెంట్ వచ్చేసింది. అయితే ఇందులో ఓ ఊహించని ట్విస్టు ఉందండోయ్.. అదేంటంటే..?

నాని-చిరు సినిమా

‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రకటనలో ఎవరూ ఊహించని ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని (Nani) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నాని తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు బాగా వైరల్ అవుతోంది. మరి ఆ పోస్టు ఏంటో.. మీరూ చూసేయండి.

ఆ కల నిజం అవుతోంది

“ఆయన్ను చూసి ప్రేరణ పొందుతూనే నేను ఎదిగాను. ఆయన సినిమాల కోసం గంటల తరబడి క్యూలైన్‌లలో ఎదురుచూశాను. చివరకు ఓసారి నా సైకిల్​ను కూడా పోగొట్టుకున్నాను. ఆయన సినిమా వచ్చిందంటే మాకు ఓ పండుగ. ఆయనే మాకు ఓ వేడుక. ఇప్పుడు ఆయన్నే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో. మెగాస్టార్‌ చిరంజీవిని మరింత కొత్తగా చూపించడానికి మేమెంతో వేచి చూస్తున్నాం. నా డైరెక్టర్ శ్రీకాంత్‌ ఓదెల(Srikanth Odela Chiranjeevi)తో ఆ కల నిజం కానుంది.” అని నాని ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో చిరంజీవితో కలిసి శ్రీకాంత్​, నాని దిగిన ఫొటోను జత చేశారు.

హింసలోనే శాంతి వెతుక్కున్నాడు

మరోవైపు.. చేతులకు రక్తం కారుతున్న ఓ పోస్టర్‌ను షేర్‌ చేసి “హింసలోనే అతడు తన శాంతిని వెతుక్కున్నాడు” అంటూ ఓ పవర్​ఫుల్ క్యాప్షన్​ను యాడ్ చేశారు. అనానిమస్‌ ప్రొడక్షన్స్‌, SLV సినిమాస్‌ బ్యానర్​పై ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు శ్రీకాంత్‌ ఓదెల, నాని కాంబోలో ‘ది ప్యారడైజ్‌ (The Paradise)’ అనే సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత చిరు ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లనుంది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *