Free Scooty Scheme: ఏపీలో మరో కొత్త స్కీం.. వీరికి త్వరలోనే ఫ్రీ స్కూటీలు!

ఏపీలో కూటమి సర్కార్(Alliance Govt in AP) అధికారంలోకి వచ్చింది మొదలు అటు అభివృద్ధి.. ఇటు సంక్షేమానికి(Welfare) పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. మరోవైపు విపక్షంలో ఉన్న YCP బురద జల్లేందుకు ఎప్పటికప్పుడు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా కూటమి గవర్నమెంట్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎన్నికల(Elections) సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇక తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు(For the disabled) ఫ్రీగా స్కూటీ(Free Scooty) అందించాలని భావిస్తోంది.

వందశాతం రాయితీతో..

ఈ మేరకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశాల మేరకు ఇప్ప‌టికే సంబంధిత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు నివేదించారు. బడ్జెట్(Budget) నుంచి నిధులు విడుదలైన వెంటనే 100% రాయితీతో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు(Three wheeler Vehicles) అందించేందుకు తదుపరి చర్యలు చేపట్టబోతున్నారు. 2024-25 ఏడాదికి గాను.. నియోజకవర్గానికి 10మంది చొప్పున 1750 మంది దివ్యాంగులకు ఈ వాహనాలు ఇవ్వనుంది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే టెండర్ల ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల(Beneficiaries)ను ఎంపిక చేసి వాహ‌నాల పంపిణీ షురూ చేస్తారు. ఒక్కో వాహనం ధర రూ. ల‌క్ష ఉంటుందని అంచనా. దీంతో మొత్తం వాహనాల పంపిణీకి రూ.17.50 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

అర్హతలు ఇవే

☛ డిగ్రీ(Degree) లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుంది.
☛ కనీసం ఒక సంవత్సరం పాటు స్వయం ఉపాధిలో నిమగ్నమైన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
☛ 70% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం(disability) ఉన్న దరఖాస్తుకు అర్హులు.
☛ 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి .
☛ కుటుంబ వార్షిక ఆదాయం(Family Income) ₹3,00,000 మించకూడదు.
☛ ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తోంది.
☛ 4 నెలల్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తారు.
☛ దరఖాస్తులను ఆన్‌లైన్‌(Online)లో లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా సమర్పించవచ్చు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *