బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా అడిలైడ్(Adelaide) వేదికగా జరుగుతోన్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 109 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయి తడబడుతోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్(Captain Rohit) సేనకు ఆదిలోనే ఆసీస్ పేస్ గన్ మిచెల్ స్టార్క్ దెబ్బతీశాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ హీరో యశస్వీ జైస్వాల్(Jaiswal)ను తొలి బంతికే డకౌట్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో భారత్ 0/1గా నిలిచింది.
కెప్టెన్ రోహిత్ మళ్లీ విఫలం
అనంతరం మరో ఓపెనర్ KL రాహుల్(37)కు జతకలిసిన గిల్(31) కాసేపు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో స్టార్క్(Starc) మరోసారి దెబ్బకొట్టాడు. హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రాహుల్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (7) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆ తర్వాత కాసేపటికే గిల్(Gil) కూడా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పంత్ రాగా.. ఈ మ్యాచులో మిడిల్ ఆర్డర్లో వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. 23 బంతులు ఎదుర్కొని కేవల 3 రన్స్‌కే ఎల్బీగా ఔటయ్యాడు. ఇక కాసేపటికే పంత్ (21) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో నితీశ్ (11), అశ్విన్ (0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, బొలాండ్ 2, కమిన్స్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆసీస్ ఆర్మీ ట్రోలింగ్
ఇదిలా ఉండగా భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను ఆసీస్ ఆర్మీ(Aussie Army) ట్రోల్ చేసింది. ఇవాళ ప్రారంభమైన రెండో టెస్టులో జైస్వాల్ స్టార్క్ వేసిన తొలి బంతికే అవుట్ అయ్యారు. తొలి టెస్టులో ‘నీ బంతులు వేగంగా రావట్లేదు’ అని జైస్వాల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేసిన విషయం తెలిసిందే. నేడు అతని బౌలింగ్‌లోనే అవుట్ అవడంతో సోషల్ మీడియాలో ఆసీస్ ఆర్మీ అక్కసు వెళ్లగక్కింది.
India's best man is getting out in front of "Mitchell Starc" bowling,Virat Kohli dismissed, KL Rahul and Yashasvi Jaiswal out,… #ViratKohli #KLRahul #YashasviJaiswal#INDvsAUS #ASUvsIND #MitchellStarc pic.twitter.com/z4zg1GA5Ai
— Hudda (@Hudda2024) December 6, 2024








