BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(Ind vs Aus) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. అడిలైడ్(Adelaide) వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టు(Pink Ball Test)లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 30 ఓవర్లలో 86/1 స్కోరు చేసింది. ప్రస్తుతం మెక్ స్వీనీ (38*), లబుషేన్ (20*) క్రీజులో నాటౌట్‌గా ఉన్నారు. బుమ్రా ఒక వికెట్ తీశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(Australia) ఇంకా 94 పరుగులు వెనకబడి ఉంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం 180 పరుగులకే కుప్పకూలింది. అయితే, నితీశ్ రెడ్డి 42 పరుగులతో రాణించి భారత్ స్కోరు 150 దాటేలా చేశాడు. మ్యాచ్ మళ్లీ రేపు ఉదయం 9.30కి ప్రారంభం కానుంది.
భారత్‌కు షాకిచ్చిన స్టార్క్
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన భారత్(India)కు ఇన్నింగ్స్ తొలి బందికే టీమిండియాకు స్టార్క్ షాకిచ్చాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను డకౌట్ చేశాడు. విరాట్ కోహ్లీని (Virat Kohli) కూడా అతడే (7) పెవిలియన్ చేర్చాడు. ఇక ఓపెనర్‌గా కాకుండా ఆరో స్థానంలో వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ (3) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం 3 రన్స్ మాత్రమే చేసి బోలాండ్ బౌలింగ్‌లో LBWగా వెనుదిరిగాడు. రిషభ్ పంత్ (21), అశ్విన్ (22) స్వల్ప స్కోర్లు చేసి ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా.. ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ చెరో 2 వికెట్లు తీశాడు.
నితీశ్ వన్ మ్యాన్ షో
తెలుగు కుర్రాడు, యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి(42) భారత జట్టులో విలువైన ప్లేయర్‌గా మారుతున్నాడు. కష్టాల్లో నిలిచిన టీమిండియాను మరోసారి ఒంటిచేత్తో ఆదుకున్నాడు. సంచలన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా ప్రధాన ఫాస్ట్ బౌలర్లను వణికించాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో బౌండరీల (3సిక్సులు, 3 ఫోర్లు)తో చెలరేగాడు. బొలాండ్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్ షాట్‌తో నితీశ్ రెడ్డి బాదిన సిక్సర్ ఈ ట్రోఫీకే హైలైట్‌గా నిలవడం ఖాయం. కాగా తొలి టెస్టులోనూ నితీశ్ 41, 38 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
𝗗𝗔𝗬 𝟭: 𝗦𝗧𝗨𝗠𝗣𝗦 𝗜𝗡 𝗔𝗗𝗘𝗟𝗔𝗜𝗗𝗘 🏏
Australia on top after Day 1 of the pink-ball Test! 🇦🇺🔝
After bowling India out for 180, they finish strong at 86/1, trailing by 94 runs. 👏🏻#AUSvIND #INDvsAUS #INDvAUS #ViratKohli #WTC25 pic.twitter.com/WRPBoZ77ip
— 𝐒𝐚𝐧𝐠𝐫𝐚𝐦 ⚚ (@shinewid_SAM) December 6, 2024








