Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప-2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. తొలి రోజు కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తోంది. పుష్ప.. తగ్గేదేలే అంటూ.. ఈసారి వైల్డ్ ఫైర్ అంటూ వచ్చిన పుష్పరాజ్.. ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఓవైపు థియేటర్లలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే.. మరోవైపు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై ప్రభంజనం సృష్టిస్తోంది.
ఫస్ట్ డే రూ.294 కోట్లు
THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema #Pushpa2BiggestIndianOpener
RULING IN CINEMASBook your tickets now!
️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/uDhv2jq8dc— Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024
ఈ క్రమంలోనే పుష్ప-2 తొలి రోజు కలెక్షన్లు (Pushpa 2 Day 1 Collections) ఇంతా.. అంతా అంటూ ఇప్పటిదాకా రకరకాల లెక్కలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా తొలి రోజు వసూళ్లను ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలో మరో తెలుగు సినిమా రికార్డు సృష్టించిందని తెలిపింది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు అత్యధికంగా ‘పుష్ప2: ది రూల్’ (pushpa 2 the rule) ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు (Pushpa 2 First Day Collection) వసూల్ చేసినట్లు ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్
‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ టాప్‌లో కొనసాగుతోందని తెలిపింది. ఇక హిందీలోనూ ‘పుష్ప2 (Pushpa 2 Hindi Collections)’ తొలిరోజు రూ.72+ కోట్లు (నెట్) వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకూ 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఐఎండీబీ ప్రకారం ఇప్పటివరకూ తొలిరోజు వసూళ్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రూ.223.5 కోట్లతో మొదటి స్థానంలో ఉండేది. ఇప్పుడు ఆ చిత్రాన్ని ‘పుష్ప2’ అధిగమించి ఏకంగా రూ.294 కోట్లు (pushpa first day collection worldwide) వసూల్ చేసింది.






