టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘సిటడెల్ : హనీ బన్నీ (Citadel : Honey Bunny)’. నవంబరు 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ రిలీజ్ అయింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సిరీస్.. తాజాగా ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది.
సమంత సిటాడెల్ హనీ బన్నీ.. ప్రతిష్ఠాత్మక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజ్ అండ్ డీకే (Raj And DK) అభిమానులతో షేర్ చేసుకున్నారు. క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్స్‌లో సిటాడెల్ ఉత్తమ విదేశీ భాష సిరీస్‌లలో స్థానం సంపాదించుకుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ నామినేషన్లలో పాపులర్ కొరియన్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ (Squid Game)’ కూడా ఉంది.
ఇక సిటాడెల్ సంగతికి వస్తే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man)’, ‘ఫర్జీ (Farzi)’ వంటి సక్సెస్ఫుల్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన రాజ్ అండ్ డీకే ఈ సిటాడెల్‌ను తెరకెక్కించారు. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 7న అందుబాటులోకి వచ్చింది. రిలీజైన నాటి నుంచి టాప్‌లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.






