OTT Platforms: థియేటర్లకు తగ్గుతోన్న జనం.. సినీ ఇండస్ట్రీకి ఓటీటీల దెబ్బ

ప్రజెంట్ ట్రెండ్ మారింది. అరచేతిలో ప్రపంచాన్నే చుట్టేస్తున్న రోజులు వచ్చేశాయ్. ఏ మూలన, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత డిజిటల్ యుగం(The digital age) ఊపందుకుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఈ డిజిటల్ మేనియా(Digital mania) సినీ ఇండస్ట్రీని కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని పలువురు సినీ నిర్మాతలు, డైరెక్టర్లు(Producers and Directors), నటీనటులు అంటున్నారు. దీనికి కారణమూ లేపోలేదు. ఎందుకంటే రూ.వేలల్లో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమాలు తీస్తుంటే రిలీజ్(Release) అయిన రోజే కొందరు పైరసీ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలకు థియేటర్లు దొరక్క నేరుగా OTTలోకే వచ్చేస్తున్నాయి. దీనికి తోడు ప్రీమియర్లు, బెనిఫిట్ షో(Premieres, benefit shows)ల పేరిట పెంచుతున్న సినిమా టికెట్ రేట్లు(Movie ticket rates) కూడా జనాన్ని థియేటర్లవైపు రాకుండా చేస్తున్న చేస్తున్నాయి.

కొవిడ్ తర్వాత పరిస్థితి మారింది

ముఖ్యంగా కొవిడ్(Covid-19) పాండమిక్ తర్వాత థియేట్రికల్ రిలీజైన సినిమాలు నెల రోజులు తిరక్కండానే OTTలోకి వచ్చేస్తుండంతో.. జనాలు సినిమా హాళ్లకు రావడం తగ్గించేశారు. చాలా సెలక్టివ్‌గా ఈవెంట్ సినిమాలు, టాక్ బాగున్న సినిమాలను మాత్రమే థియేటర్లలో చూస్తున్నారు. దీంతో మన టాలీవుడ్ పెద్దలు మీటింగ్ పెట్టి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. థియేటర్ సిస్టమ్‌ను బతికించుకోడానికి 50 రోజుల తర్వాతే OTTకి ఇవ్వాలనే Rule పెట్టుకున్నారు. కానీ రియాలిటీలో మాత్రం అది ఆచరణ సాధ్యం కాలేదు. 3,4 వారాలకే స్ట్రీమింగ్(streaming) చేయడం స్టార్ట్ చేశారు. ఇక చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడంతో కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీలోనే రిలీజ్(OTT release) చేస్తున్నారు.

నెల రోజుల్లోపే OTTల్లోకి

పైగా ఇటీవల విడుదలైన నెల రోజుల్లోపే OTTలోకి వచ్చేస్తున్నాయి. వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘మట్కా(Matka)’ నవంబర్ 14న రిలీజైంది. అయితే 21 రోజుల్లోనే సైలెంట్‌గా OTTలో ప్రత్యక్షమైంది. అంతకముందు నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’.. కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాలు 28 రోజుల్లో OTTల్లోకి వచ్చేశాయి. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్(Amaran)’ మూవీ మాత్రం 35 రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇలాగే ఫ్యూచర్లోనూ జరిగితే థియేటర్ల ఆక్యుపెన్సీ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని నిర్మాతలు వాపోతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *