తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ఇప్పటికే సీఎం రేవంత్(CM Revanth) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా తమ ఏడాది విజయవంత పాలనపై మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) స్పందించారు. తాను సైలెంట్ కిల్లర్‌ని కాదని, చురుకైన కాంగ్రెస్ కార్యకర్తనని తెలిపారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మంత్రి శ్రీధర్ బాబు పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. KCR పాలనలోని BRS ప్రభుత్వంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. యువత పదేళ్ల పాటు చాలా వేదన పడిందని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 55 వేల ఉద్యోగాలు ఇచ్చాని గుర్తు చేశారు.
పెండింగ్ హామీలు ఒక్కొక్కటిగా అమలు
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ స్కీము(Free Bus Scheme) అమలు చేశామన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్(Job Calander) విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ(Runamafi) చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికికే దక్కుతుందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న హామీల అమలుకు కసరత్తు జరుగుతోందని మంత్రి చెప్పుకొచ్చారు. రేషన్ కార్డు(Ration Card) లబ్ధిదారులకు త్వరలోనే సన్నం బియ్యం ఇచ్చే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. హామీల అమలుకు కొంత టైమ్ పడుతుందన్నారు. కళ్యాణలక్ష్మి(Kalyana Lakhshmi) పథకంలో తులం బంగారం లాంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.
హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర
ఇదిలా ఉండగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్(Brand Image of Hyderabad) దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు(Investments) తరలిపోతున్నాయనేది పూర్తిగా అబద్ధమన్న మంత్రి, గత ప్రభుత్వంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలకు సైతం సకల సదుపాయలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. రియల్ఎస్టేట్లో ఇప్పటికీ హైదరాబాద్ టాప్ పొజిషన్లో ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు.






